సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంతరిక్షం నుంచి ఎలా ఓటేస్తారు?

How Will Sunita Williams and Butch Wilmore Vote in the US Presidential Election From Space
x

సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంతరిక్షం నుంచి ఎలా ఓటేస్తారు?

Highlights

బోయింగ్ సంస్థ స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలతో ఈ ఇద్దరు వ్యోమగాములు 2025 ఫిబ్రవరి వరకు ఐఎస్ఎస్ లోనే ఉంటారని నాసా తెలిపింది.

సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోగలరా? అంతరిక్ష ప్రయోగశాలలో చిక్కుకున్న ఈ ఇద్దరు అక్కడి నుంచి ఎలా ఓటు వేస్తారు?

బోయింగ్ సంస్థ స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలతో ఈ ఇద్దరు వ్యోమగాములు 2025 ఫిబ్రవరి వరకు ఐఎస్ఎస్ లోనే ఉంటారని నాసా తెలిపింది. అయితే, అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ నెలలో జరుగుతాయి. దాంతో, వీరిద్దరూ తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని నాసాను కోరారు.

అంతరిక్ష కేంద్రం నుంచి ఓటు ఎలా వేస్తారు?

అంతరిక్షంలో ఉన్న ఇద్దరు వ్యోమగాములు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను అక్కడికి పంపుతారు. వ్యోమగాములు తమకు నచ్చిన అభ్యర్ధికి ఓటు వేసి మళ్లీ భూమి మీదకు పంపిస్తారు. పారదర్శకత కోసం ఎన్ క్రిప్షన్ పద్దతిలో బ్యాలెట్లను హ్యూస్టన్ లో నాసా మిషన్ కంట్రోల్ సెంటర్ పంపుతారు. అక్కడి నుంచి ఆయా రాష్ట్రాల్లోని కౌంటీ క్లర్క్ లకు పంపించి ప్రాసెస్ చేయిస్తారు.

1997 నుంచే అంతరిక్షం నుంచి ఓటు హక్కు

సంప్రదాయ పోలింగ్ స్టేషన్లు లేకున్నా అంతరిక్షం నుంచి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం 1997 లో నాసా ప్రవేశపెట్టింది. అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు ఓటు వేసేందుకు అనుమతించేలా బిల్లును టెక్సాస్ చట్టసభ్యులు ఆమోదించారు. దీంతో తొలుత డేవిడ్ వోల్స్ అంతరిక్షం నుంచి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత అంటే 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నాసా వ్యోమగామి కేట్ రూబిన్స్ అంతరిక్షం నుంచి ఓటు వేశారు.

సునీతా విలియమ్స్, విల్మోర్ లు అంతరిక్షంలో ఎలా ఉన్నారు?

ఈ ఏడాది జూన్ లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు చేరకున్నారు. స్టార్ లైనర్ లో టెక్నికల్ సమస్యలు ఏర్పడడంతో ఎనిమిది రోజులు మాత్రమే అంతరిక్షంలో ఉండాల్సిన వీరిద్దరూ వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు అక్కడే ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి.

వీరిని భూమి మీదకు తిరిగి రప్పించేందుకు స్పేస్ క్యాప్సూల్స్ ను తిరిగి తీసుకురానున్నారు.అంతరిక్షంలో కొన్ని కఠిన సమయాలను ఎదుర్కొన్నట్టుగా వ్యోమగాములు చెబుతున్నారు. అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండడంతో వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యనిపుణులు గుర్తించారు.

వ్యోమగాముల అభ్యర్ధన మేరకు అంతరిక్ష కేంద్రానికి నాసా ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను పంపనున్నారు. ఈ మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories