Hezbollah Fires 250 Rockets: ఇజ్రాయెల్‌పై 250 రాకెట్స్ ప్రయోగించిన హెజ్బొల్లా.. నలుదిక్కుల పేలుళ్ల మోత.. వీడియో
Hezbollah Fires 250 Rockets on Israel: ఇజ్రాయెల్, హోజ్బొల్లా మధ్య యుద్ధం ఆగడం లేదు. నిన్నటి ఆదివారం కూడా రెండు వర్గాల మధ్య బాంబుల మోత మోగింది....
Hezbollah Fires 250 Rockets on Israel: ఇజ్రాయెల్, హోజ్బొల్లా మధ్య యుద్ధం ఆగడం లేదు. నిన్నటి ఆదివారం కూడా రెండు వర్గాల మధ్య బాంబుల మోత మోగింది. హెజ్బొల్లాకు గట్టి పట్టున్న దక్షిణ బేరూట్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించినట్లుగా లెబనీస్ మీడియా చెబుతోంది. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా హెజ్బొల్లా కూడా రాకెట్స్ వర్షం కురిపించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250 రాకెట్స్‌ను ఇజ్రాయెల్‌పైకి ఎక్కుపెట్టింది. హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ చరిత్రలో ఇదొక అతిపెద్ద దాడిగా ఆ సంస్థ ప్రకటించింది.
హెజ్బొల్లా ప్రయోగించిన రాకెట్స్‌లో కొన్నింటిని ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ విజయవంతంగా తిప్పికొట్టింది. ఇంకొన్ని మిస్సైల్స్ సెంట్రల్ ఇజ్రాయెల్‌పై పడ్డాయి. ఈ మిస్సైల్స్ ఎటాక్‌లో కొన్ని ఇళ్లు ధ్వంసమైనట్లుగా అసోసియేటెడ్ ప్రాన్స్ ప్రెస్ వెల్లడించింది. ఇంకొన్ని మిస్సైల్స్ ఏకంగా ఇజ్రాయెల్‌కి అతి ముఖ్యమైన టెల్ అవీవ్ నగరం వరకు చేరుకున్నాయని ఆ వార్తా సంస్థ తెలిపింది.
⚡️Hezb-Allah publish footage of them targeting the military bases belonging to the Israeli enemy army in the city of Tel Aviv (occupied Jaffa) with suicide drones and "Fadi 6" and "Qader 2" missiles pic.twitter.com/WNs7wQtbR2
— War Monitor (@WarMonitors) November 24, 2024
ఈసారి మిస్సైల్స్ ఎటాక్‌లో హెజ్బొల్లా ఏకకాలంలో నాలుగు లక్ష్యాలను టార్గెట్ చేసింది. దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఆష్దాదా నేవల్ బేస్ లక్ష్యంగా హెజ్బొల్లా ఈ మిస్సైల్స్ దాడి జరిపింది. వెంటనే టెల్ అవివ్‌లోని మిలిటరీ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని అడ్వాన్స్‌డ్ రాకెట్స్ ప్రయోగించింది. అదే సమయంలో నగరానికి మరో వైపున ఉన్న గ్లిలాట్ ఆర్మీ ఇంటెలీజెన్స్ స్థావరంపై కూడా మిస్సైల్స్ ప్రయోగించింది. హెజ్బొల్లా వైపు నుండి 250 మిస్సైల్స్ దాడి జరిగినట్లుగా ఇజ్రాయెల్ డిఫెన్స్ వర్గాలు కూడా అంగీకరించాయి. హెజ్బొల్లా చేసిన మిస్సైల్స్ దాడుల్లో ఇదే అతిపెద్ద దాడిగా ఇజ్రాయెల్ రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire