కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం

Heavy Rains In Kenya 45 Dead Due To Dam Failure
x

కెన్యాలో భారీ వర్షాలు.. డ్యాం కూలి 45 మంది దుర్మరణం

Highlights

వరదలకు కొట్టుకుపోయిన ఇళ్లు నీటమునిగిన పలు నగరాలు

Kenya: ఆఫ్రికా దేశమైన కెన్యాలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో పశ్చిమ కెన్యాలోని మై మహియు ప్రాంతంలోని పురాతన కిజాబె డ్యాం కూలిపోయింది. ఫలితంగా ఆకస్మిక వరదలు సంభవించి పలు నివాసాలు దెబ్బతిన్నాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. ఈ దుర్ఘటనలో 45 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే వందమందికి పైగా ప్రజలు మృతిచెందారు. వరదల కారణంగా 2 లక్షల మంది ప్రజలు స్థానిక పాఠశాలల్లో ఆశ్రయం పొందుతున్నారు.

వర్షాలు మరికొన్ని రోజులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో పాఠశాలలకు ఇచ్చిన మధ్యంతర సెలవుల్ని ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఆఫ‌్రికాలోని మరో దేశమైన టాంజానియాలో రెండు రోజుల క్రితం భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వరదలు, కొండచరియలు విరిగిపడి ఆ దేశంలో ఇప్పటికే 155 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories