Brazil: బ్రెజిల్‌లో గత రెండు వారాలుగా భారీ వర్షాలు

Heavy Rains In Brazil For The Last Two Weeks
x

Brazil: బ్రెజిల్‌లో గత రెండు వారాలుగా భారీ వర్షాలు 

Highlights

Brazil: 145 మంది మృతి, 132 మంది గల్లంతు

Brazil: బ్రెజిల్‌లో గత రెండు వారాలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 145కు చేరుకుంది. అలాగే మరో 132 మంది అదృశ్యమైనట్టు ఆ దేశ పౌర రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ముఖ్యంగా వర్షాల వల్ల రియో​గ్రాండే దో సుల్ రాష్ట్రం తీవ్రంగా ప్రభావితమైనట్టు పేర్కొంది. వరద భారీగా వస్తుండటంతో నదులన్నీ ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. దీంతో 6లక్షలా 19వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెస్క్యూ కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం అత్యవసర వ్యయాన్ని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూస్తామని తెలిపారు. ఇప్పటికే రెస్క్యూ కార్యకలాపాలను వేగవంతం చేశామని స్పష్టం చేశారు. అయితే భారీ వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. బ్రెజిల్‌లోని పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. బ్రెజిల్‌కు సహాయం అందించడానికి అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని.

Show Full Article
Print Article
Next Story
More Stories