Hamas Chief: ఇరాన్‌లో.. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య.. ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుందా?

hamas-chief-ismail-haniyeh-killed-in-tehran-amid-israel-hamas-war-in-gaza-iran-suspect-mosad
x

Hamas Chief: ఇరాన్‌లో.. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య.. ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుందా?

Highlights

Hamas Chief: హమాస్ కు గట్టి షాక్ తగిలింది. ఆ సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఇస్మాయిల్ హనియాను ఇజ్రాయెల్ హత్య చేసిందా? తన ప్రతీకారం తీర్చుకుందా? పూర్తి వివరాలు చూద్దాం.

Hamas Chief: గత కొన్నాళ్లుగా ఇజ్రాయెల్ తో పోరాటం చేస్తున్న హమాస్ కు గట్టి షాక్ తగిలింది. ఆ సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్ లో హత్యకు గురయ్యారు. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యకు గురైనట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. ఇస్మాయిల్ హనియా గత కొన్నేళ్లుగా హమాస్‌కు చీఫ్ గా ఉన్నారు. గతేడాది అక్టోబరులో ఇజ్రాయెల్‌లో పౌరుల ఊచకోతకు పథకం వేసినట్లు హనియాపైనే ఆరోపణలు వచ్చాయి. ఇస్మాయిల్ హనియా గురించి కొన్ని ప్రత్యేక విషయాలు తెలుసుకుందాం.

ప్రధానమంత్రి పదవిగా ఇస్మాయిల్ హనియా:

ఇస్మాయిల్ హనియా హమాస్ పొలిటికల్ బ్యూరో అధిపతి. అతను పాలస్తీనా అథారిటీకి సంబంధించిన పదవ ప్రభుత్వంలో ప్రధాన మంత్రిగా పనిచేశాడు.అనంతరం హనియా 2006లో ప్రధానమంత్రి అయ్యాడు. కానీ ఒక సంవత్సరం తర్వాత పాలస్తీనియన్ నేషనల్ అథారిటీ చీఫ్ మహమూద్ అబ్బాస్ ఆయనను పదవి నుండి తొలగించారు. గాజా స్ట్రిప్‌ను అల్-కస్సామ్ బ్రిగేడ్‌లు స్వాధీనం చేసుకున్నందున, ఫతా ఉద్యమ నాయకులను బహిష్కరించినందుకు హనియాను పదవిలో నుంచి తొలగించారు.

హనియాను ఉగ్రవాదిగా ప్రకటించిన అమెరికా:

ఇస్మాయిల్ హనియాను అమెరికా విదేశాంగ శాఖ 2018లో ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇస్మాయిల్ హనియా 2017లో హమాస్ పొలిటికల్ బ్యూరో అధిపతిగా ఎన్నికయ్యారు. అయితే అతను గాజాలో కాకుండా ఖతార్‌లో నివసించాడు. ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న యుద్ధం మధ్య ఖతార్,ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహించిన శాంతి చర్చలకు హనియా హమాస్‌కు నాయకత్వం వహించాడు. గత మే నెలలోనే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు హనియాపై అరెస్ట్ వారెంట్‌ను కోరింది.

ఇస్మాయిల్ హనియా హత్య ?

ఇస్మాయిల్ హనియా.. కొత్త ఇరాన్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం కోసం ఆయన ఇరాన్‌లో పర్యటించారు. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ టెహ్రాన్‌లోని హనియా రహస్య స్థావరంపై దాడిలో హమాస్ చీఫ్‌తో పాటు ఒక అంగరక్షకుడు మరణించినట్లు చెప్పారు.కాగా హమాస్ తన నాయకుడి హత్యను ధృవీకరించింది. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్‌పై ఈ దాడిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హనియా హత్య వార్త తెలియగానే ఇజ్రాయెల్ హై అలర్ట్ ప్రకటించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) తెలిపింది.

ఇస్మాయిల్ హనియా పాలస్తీనాలోని గాజా ప్రాంతాన్ని నియంత్రించే ఇస్లామిక్ గ్రూప్ హమాస్ నాయకుడు. ఇరాన్ కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు టెహ్రాన్ చేరుకున్నారు. మంగళవారం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు సీనియర్‌ నేతలతో కలిసి హనియా కనిపించారు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున హింసను వ్యాపింపజేసినప్పటి నుంచి హనియా లక్ష్యంగా ఉన్నాడు. ఈ సంఘటన తర్వాత మాత్రమే ఇజ్రాయెల్,హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. దీనిలో ఇజ్రాయెల్ బాంబు దాడులు గాజా స్ట్రిప్‌ను పూర్తిగా నాశనం చేశాయి. వేలాది మంది ప్రజలు మరణించారు. అక్టోబర్ 7 దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ అతన్ని టెహ్రాన్‌లో హత్య చేసిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొసాద్ ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇలాంటి ఆపరేషన్లు చేసింది.

హమాస్ చీఫ్ హత్య వార్త వెలుగులోకి వచ్చిన అనంతరం.. ఇజ్రాయెల్ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి డేనియల్ హగారి మాట్లాడుతూ..మేము ఇజ్రాయెల్ ప్రజల కోసం ఎటువంటి కొత్త అత్యవసర ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇజ్రాయెల్ అధికారులు హమాస్ నుండి తక్షణ ప్రతీకార చర్యను ఆశించకపోవడమే దీనికి ఒక కారణం. మేము యుద్ధం లేకుండా శత్రుత్వాన్ని పరిష్కరించడానికి ఇష్టపడతాము. అయితే ఇజ్రాయెల్ సైన్యం ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవటానికి పూర్తి అప్రమత్తంగా ఉందని తెలిపారు. మొత్తానికి హమాస్ చీఫ్ హత్యతో ఇజ్రాయోల్ ప్రతీకారం తీర్చుకుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. .

Show Full Article
Print Article
Next Story
More Stories