Human Trafficking: భారతీయులతో వెళ్తున్న విమానం ఫ్రాన్స్‌లో నిలిపివేత.. స్పందించిన భారత్‌..

France Grounds Aircraft Bound to Nicaragua With 300 Indians on Board
x

Human Trafficking: భారతీయులతో వెళ్తున్న విమానం ఫ్రాన్స్‌లో నిలిపివేత.. స్పందించిన భారత్‌..

Highlights

Human Trafficking: మానవ అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో 303 మంది భారతీయులతో నికరాగువా వెళుతున్న విమానాన్ని ఫ్రాన్స్ నిలిపివేశారు.

Human Trafficking: మానవ అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో 303 మంది భారతీయులతో నికరాగువా వెళుతున్న విమానాన్ని ఫ్రాన్స్ నిలిపివేశారు. ఈ ఘటనలో ప్రయాణికుల్లోని ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం తాజాగా స్పందించింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించింది.

303 మంది ప్రయాణికులతో నికరాగువా వెళుతున్న విమానాన్ని ఆపేసినట్లు ఫ్రాన్స్‌ అధికారులు తెలియజేశారు. వీరిలో ఎక్కువ మంది భారతీయులు దుబాయ్ నుంచి నికరాగువా వెళుతున్నారు. మానవ అక్రమరవాణా జరుగుతోందనే సమాచారం అందడంతో ఫ్రాన్స్‌ విమానాశ్రయంలో విమానాన్ని నిలిపివేశారు. ఎంబసీ బృందానికి కాన్సులర్ యాక్సెస్‌ లభించిందని, పరిస్థితిని పరిశీలించి ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, ప్రయాణికుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నామంటూ అంటూ భారత ఎంబసీ ట్వీట్ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories