Bill Clinton: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కు అస్వస్థత..ఆసుపత్రిలో చేరిక

Bill Clinton: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కు అస్వస్థత..ఆసుపత్రిలో చేరిక
x
Highlights

Bill Clinton: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. 78 ఏళ్ల బిల్ క్లింటన్ జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం.

Bill Clinton: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను వాషింగ్టన్ లోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌లో చేరారు. ఈ మేరకు క్లింటన్ వ్యక్తిగత సిబ్బంది ఈ విషయాన్ని తెలియజేశారు. క్లింటన్ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని..ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు. తనకు అందుతున్న వైద్య సేవల పట్ల క్లింటన్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. క్రిస్మస్ నాటికి ఆయన ఇంటికి తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు అక్కడి అధికారులు.

బిల్ క్లింటన్ జనవరి 1993 నుండి జనవరి 2001 వరకు రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేశారు. ఎన్నికల సందర్భంగా ఆయన ఇటీవల చికాగోలో జరిగిన డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో ప్రసంగించారు. కమలా హారిస్ వైట్ హౌస్ బిడ్ కోసం ప్రచారం చేశారు.వైట్‌హౌస్‌ను విడిచిపెట్టినప్పటి నుండి క్లింటన్ అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. 2004లో శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు.



2021లో, మాజీ అధ్యక్షుడికి ఇన్‌ఫెక్షన్ సోకింది, దీని కోసం అతను కాలిఫోర్నియాలో ఆరు రోజులు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. 2010లో గుండె సంబంధిత సమస్యలు రావడంతో మరోసారి శస్త్ర చికిత్స్ చేయించుకుని రెండు స్టంట్లు అమర్చారు. ఇటీవల ఎన్నికల్లో చురుకుగా ప్రచారం నిర్వహించారు.Bill Clinton: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. 78 ఏళ్ల బిల్ క్లింటన్ జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories