UK Parliament: యూకే పార్లమెంట్‌లో ప్రసంగించిన రోబో

First Humanoid Robot Speaks at UK Parliament
x

యూకే పార్లమెంట్‌లో ప్రసంగించిన రోబో

Highlights

*తాజా రోబోకు బ్రిటన్‌ గణిత శాస్త్రవేత్త ఐడా లవ్‌లేస్‌ పేరు

UK Parliament: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ యుగం ప్రారంభమైంది. తక్కువ కాలంలో ఎక్కువ పని చేసేందుకు యంత్రాల సాయం తీసుకున్న మనిషి ఆ తరువాత రోబోల తయారీకి శ్రీకారం చుట్టాడు. ఆ రోబోలు.. మనిషి ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా పని చేయడమే కాదు స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అలాంటి రోబోలను హ్యూమనాయిడ్‌ రోబో అని పిలుస్తారు. తాజాగా ఇలాంటి రోబో ఒకటి బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రసంగించి అందరినీ ఆశ్చర్యపరిచింది. పార్లమెంట్‌లో అలా ఓ రోబో ప్రసంగించడం యూకే చరిత్రలోనే తొలిసారి. 2019లో ఐడాన్ మెలెర్‌ ఆవిష‌్కరించిన ఈ రోబోకు బ్రిటన్‌ గణిత శాస్త్రవేత్త ఐడాలవ్‌లెస్ పేరులోని పదాలను తీసుకుని ఐ-డాగా పిలుస్తున్నారు.

యూకే పార్లమెంట్‌ ఎగువ సభలో సభ్యులు ఐ-డాతో మాట్లాడారు. ఎంపీలు అడిగిన పలు ప్రశ్నలకు ఐ-డా ఆసక్తికరమైన సమాధానాలను ఇచ్చింది. తనకు జీవం లేకపోయినా కుంచెను పట్టుకుని బొమ్మలు వేయగలనని స్పష్టం చేసింది. తనకు ఊహా శక్తి ఉందని ఆ ఊహలను కూడా చిత్రీకరించగలనని ఐ-డా తెలిపింది. మానవుల ఊహాశక్తి భిన్నంగా ఉండే వాటి గురించి మాట్లాడగలిగినప్పటికీ తనకు ఎలాంటి అనుభవాలు లేవని ఐడా చెప్పి సభ్యులను ఆకట్టుకుంది. అయితే ఇలాంటి హ్యూమనాయిడ్‌ రోబోనే ఇటీవల ఎలక్ట్రానిక్‌ కార్ల కంపెనీ టెస్లా సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ ప్రదర్శించి ఆందరినీ ఆశ్చర్యపరిచాడు. అది స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుందని వెల్లడించారు. అక్టోబరు 2న జరిగిన ఆర్టిఫిషియల్‌ డే సందర్భంగా కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో హ్యుమనాయిడ్‌ రోబో అలరించింది. దానికి ఆఫ్టమస్‌ అనే పేరును కూడా ఎలాన్‌ మస్క్‌ పెట్టారు.

తర్వలోనే అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో కూడిన సెక్సీ రోబోలను తయారుచేస్తామంటూ ఏప్రిల్‌లోనే ఎలాన్ మస్క్‌ సంచలన ప్రకటన చేశారు. ఆప్టిమస్‌ రోబో వెర్షన్‌లోనే క్యాట్‌గర్ల్‌ వెర్షన్‌ రాబోతుందని అప్పట్లో హింట్‌ ఇచ్చారు. ఇప్పుడు ఆప్టిమస్‌ రావడంతో ఎలాన్‌ మస్క్‌ అనుకున్నంత పని చేస్తాడా? అంటూ ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. అసలు టెస్లా తయారుచేసే ఆప్టిమస్‌ క్యాట్‌ గర్ల్‌ వెర్షన్‌ ఎలా ఉండబోతోంది? అంటూ టెక్‌ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. టెస్లా రూపొందిస్తున్న ఈ ఆప్టిమస్‌ రోబోలు అందుబాటులోకి రావడానికి మరో రెండు నుంచి ఐదేళ్లు పట్టే అవకాశం ఉంది. ఈ రోబోలను 20వేల డాలర్లలోపే విక్రయించేలా రూపొందిస్తామని ఎలాన్‌ మస్క్‌ అప్పట్లోనే ప్రకటించారు. అంటే మన రూపాయల్లో అయితే.. 16 లక్షలు పలికే అవకాశం ఉంది. అయితే అందరి దృష్టి అప్టిమస్ క్యాట్‌ గర్ల్‌ రోబోపైనే నెలకొన్నది. ఇక హాంకాంగ్‌ రోబో కంపెనీ సోఫియాను 2016లోనే యతయారు చేసింది. అప్పట్లో టెక్సాస్‌లో జరిగిన సౌత్‌ వెస్ట్‌ ఫెస్టివల్‌లో ఈ సోఫియాను బయటి ప్రపంచానికి పరిచయం చేశారు. దీనికి 2017లో పౌరసత్వం కూడా లభించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories