Facebook Removed Trump Post : ట్రంప్ కి షాక్ ఇచ్చిన ఫేస్ బుక్!

Facebook Removed Trump Post : ట్రంప్ కి షాక్ ఇచ్చిన ఫేస్ బుక్!
x
Trump (File Photo)
Highlights

Facebook Removed Trump Post : అమెరికా దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి ఫేస్ బుక్ షాక్ ఇచ్చింది. తాజాగా అయన చేసిన ఓ పోస్ట్ ను

Facebook Removed Trump Post : అమెరికా దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి ఫేస్ బుక్ షాక్ ఇచ్చింది. తాజాగా అయన చేసిన ఓ పోస్ట్ ను ఫేస్ బుక్ డిలిట్ చేసింది. ఇంతకి జరిగింది ఏంటంటే.. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపధ్యంలో తప్పుడు సమాచారంపై ఫేస్‌బుక్‌ చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే కరోనా నుంచి ఎలాంటి తప్పుడు వార్త వస్తే వెంటనే డిలీట్ చేస్తోంది. ఈ క్రమంలోనే డొనాల్డ్‌ ట్రంప్ చేసిన ఓ పోస్ట్‌ను కూడా ఫేస్‌బుక్‌ తొలగించింది..

తాజాగా ట్రంప్‌ ఓ వీడియోను పోస్ట్ చేశారు.. ఆ పోస్ట్ లో అయన కరోనాను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి చిన్నారుల్లో ఎక్కువగా ఉంటుందని అంటూ వెల్లడించారు. దీనితో ఈ విషయం పట్ల ఎలాంటి ఆధారాలు లేవని, తమ సంస్థ నిబంధనలను ఉల్లంఘిస్తూ, డోనాల్డ్ ట్రంప్ తప్పుడు సమాచారాన్ని షేర్ చేశారని ఫేస్‌బుక్‌ పేర్కొంది. ఈ సమాచారం బయటకు వెళ్తే హానికరమని, అందుకే ఈ పోస్టును తొలగించామని ఫేస్‌బుక్ సంస్థ వివరణ ఇచ్చింది. అయితే డోనాల్డ్ ట్రంప్ ఇలాంటి పరిస్థితిని ఎదురుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories