Jaishankar: పానీపూరి పై విదేశాంగమంత్రి జైశంకర్ వైరల్ కామెంట్స్..!
* భారత విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్ ను ఓ ఎన్ ఆర్ ఐ ఆసక్తికర ప్రశ్న అడిగాడు. హాంబర్గ్ స్థానంలో పానీపూరీ గురించి ప్రపంచం ఆలోచించే రోజుని మనం చూస్తామా అని అడిగాడు.
Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. మోదీ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎస్. జైశంకర్..అంతర్జాతీయ వేదికలపై భారత వాణిని మొహమాటం లేకుండా వినిపిస్తారు. అందుకే, ఎస్.జైశంకర్ ను ప్రముఖులు సైతం అభిమానిస్తారు. సోషల్ మీడియాలో ఆయన ఫాలోవర్స్ సంఖ్యే అందుకు నిదర్శనం. రీసెంట్ గా ఎస్ సీఓ విదేశాంగ మంత్రుల మండలి సమావేశంలో..న్యూఢిల్లీ-ఇస్లామాబాద్ మధ్య సంబంధాల పతనానికి ఆర్టికల్ 370 రద్దు కారణమని పాక్ మంత్రి బిలావత్ భుట్టో జర్దారీ చేసిన కామెంట్స్ కు ఆర్టికల్ 370 చరిత్ర..మేల్కొని కాఫీ తాగండి అంటూ జైశంకర్ కౌంటర్ ఇచ్చారు. కేవలం పాక్ తోనే కాదు గతంలో అమెరికాతో సైతం జైశంకర్ ముక్కుసూటిగా మాట్లాడి ప్రపంచదేశాలనే నివ్వెరపరిచారు.
ప్రస్తుతం జైశంకర్ స్వీడన్ లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రవాస భారతీయులతో ముచ్చటించారు. భారతీయుల సంస్కృతి ప్రపంచీకరణ గురించి ఎన్ ఆర్ ఐలు అడిగిన ప్రశ్నలకు జైశంకర్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. విదేశీయులు ఫాస్ట్ ఫుడ్ గురించి ఆలోచించినప్పుడు హాంబర్గ్ కు బదులుగా పానీపూరీ గురించి ఆలోచిస్తారా అని ఓ ప్రవాసుడు అడిగాడు. దీనికి జైశంకర్ బదులిస్తూ...మీరు అన్నట్లుగానే నిజం కావాలని ఆశిద్దాం..అదే జరిగితే మీ నోరు తీపి చేస్తానన్నారు. జైశంకర్ ఇచ్చిన సమాధానానికి అందరు చప్పట్లు కొట్టారు. భారతీయ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడం మనం ఇప్పుడిప్పుడే చూస్తున్నామని..న్యూ యార్క్ అనే పేరుకు బదులుగా న్యూ ఢిల్లీ అనే ప్రింట్ ఉండే టీషర్టులను సైతం త్వరలోనే చూస్తామని జైశంకర్ ధీమా వ్యక్తం చేశారు.
Peter from Sweden asks India's External Affairs Minister @DrSJaishankar: In the future when we think of fast food will we think of Pani Puri instead of Hamburger?
— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 18, 2023
Dr. S. Jaishankar: I don't know if you follow Hindi but there is a term which says, Aapke Mu Mein Ghee Shakar.… pic.twitter.com/ugmDHX82BM
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire