Elon Musk: ఎలాన్ మస్క్ రాకెట్ ప్రయోగం..వీక్షించేందుకు డొనల్డ్ ట్రంప్ హాజరు

ISRO Launches INSAT-3DS Satellite on GSLV-F14 to Space
x

GSLV-F14: నింగిలోకి దూసుకెళ్లిన GSLV F-14

Highlights

Elon Musk: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన అత్యంత ఆధునాతన సమాచార ఉపగ్రహం జీశాట్ 20 విజయవంతంగా నింగిలోకి దూసుకువెళ్లింది. ఎలాన్ మస్క్...

Elon Musk: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన అత్యంత ఆధునాతన సమాచార ఉపగ్రహం జీశాట్ 20 విజయవంతంగా నింగిలోకి దూసుకువెళ్లింది. ఎలాన్ మస్క్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించారు. ల్యాంచింగ్ ప్యాడ్ నుంచి రాకెట్ బయలుదేరిన అరగంట తర్వాత ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది. కొద్ది రోజుల్లో కర్నాటక హసన్ లో ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్ ఈ ఉపగ్రహాన్ని నియంత్రణలోనికి తీసుకుంది. ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ ఎండీ రాధాకృష్ణణ్ దురయ్ రాజ్ తెలిపారు. ప్రయోగాన్ని పర్యవేక్షించిన ఆయన జీశాట్ 20 కచ్చితమైన కక్షలోకి చేరిందని వెల్లడించారు.

ఫాల్కన్ 9 రాకెట్ కు ఇది 396 ప్రయాణం. 4700కిలోల బరువు ఉన్న ఈ ఉపగ్రహాన్ని విజయవంతంగా తీసుకెళ్లింది. ఇస్రో దగ్గర ప్రస్తుతం రాకెట్స్ ఈ ఉపగ్రహాన్ని తీసుకెళ్లేందుకు సాధ్యపడకపోవంతో స్పేస్ ఎక్స్ సహకారం తీసుకున్నారు. కెప్ కెనవెరాల్ లోని స్పేస్ కాంప్లెక్స్ లో 2019లో ప్రత్యేకంగా అమెరికా సాయుధ దళాల కోసం ఏర్పాటు చేసిన ల్యాంచ్ ప్యాడ్ ను స్పేస్ ఎక్స్ అద్దెకు తీసుకుని ఈ ప్రయోగాన్ని చేపట్టింది.

బెంగళూరులోని యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ నుంచి ప్రయోగాన్ని పర్యవేక్షించిన ఇస్రో చీఫ్ సోమనాథ్ మాట్లాడారు. జీశాట్ ఎన్ 2 లేదా జీశాట్ 20 ఉపగ్రహం 14ఏళ్ల పాటు సేవలు అందించనుందని తెలిపారు. భూకేంద్రంలోని మౌలికసౌకర్యాలు శాటిలైట్ త అనుసంధానం కానుందని వివరించారు. కచ్చితమైన కక్ష్యలోకి ఉపగ్రహం చేరడంతో ప్రయోగం విజయవంతమైనట్లు తెలిపారు. ఉపగ్రహంలో ఎలాంటి సమస్యలు లేవన్నారు. సోలార్ ప్యానెల్లు అమర్చినట్లు సోమనాథ్ తెలిపారు.

ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బ్రౌన్స్ విల్లేపై విమానాలు ఎగరడంపై ఆంక్షలు విధించారు. ట్రంప్ నివాసం ఉండే వెస్ట్ పామ్ బీచ్ గగనతలంపై ఆంక్షలు సడలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories