Elon Musk: ఇటలీ ప్రధాని మెలోనితో మస్క్ ప్రేమలో పడ్డారా? స్పందించిన మస్క్!

Elon Musk: ఇటలీ ప్రధాని మెలోనితో మస్క్ ప్రేమలో పడ్డారా? స్పందించిన మస్క్!
x
Highlights

బిలియనేర్ ఎలాన్ మస్క్, ఇటలీ ప్రధాని జార్జియా మెలొని ఇద్దరూ ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకుంటున్నట్లుగా ఉన్న ఫోటో వైరల్ అవుతోంది.

Elon Musk, Georgia Meloni News: బిలియనేర్ ఎలాన్ మస్క్ ఇటలీ ప్రధాని జార్జియా మెలొనితో ప్రేమలో పడ్డారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో చూశాకా ఇప్పుడు చాలామందిలో కలుగుతున్న సందేహాలివి. కేవలం ఫోటో మాత్రమే కాదు.. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఒక భారీ సదస్సులో జార్జియా మెలొనికి అవార్డు ప్రకటిస్తూ ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కూడా అందుకు మరో కారణమైంది. ఆ వేదికపై జార్జియా మెలొనికి అట్లాంటిక్ కౌన్సిల్ గ్లోబల్ సిటిజెన్ అవార్డ్ ప్రకటిస్తూ ఎలాన్ మస్క్ ఆమెని ప్రశంసల్లో ముంచెత్తారు. జార్జియా మెలొని ఒక నిజాయితీపరురాలు, ఆమె ఎప్పుడూ నిజమే చెబుతారు అంటూ ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జార్జియా మెలొని గురించి ఇంకా మాట్లాడుతూ, ఆమె బయటికి కనిపించే బాహ్య సౌందర్యం కంటే ఆమె అంతర్గత సౌందర్యం ఇంకా గొప్పదన్నారు. అంటే ఆమె మనసు ఇంకా గొప్పదని ఎలాన్ మస్క్ తన మాటల్లో అలా వ్యక్తపరిచారు. ఎలాన్ మస్క్ అంతటితో సరిపెట్టుకోలేదు. ఇటలీ ప్రధానిగా జార్జియా మెలొని చాలా గొప్పగా పనిచేశారన్నారు. తాను కూడా మెలోనిని ఆదర్శంగా తీసుకుంటానని చెప్పారు. మెలోనిని అభినందిస్తూ అన్ని సానుకూల వ్యాఖ్యలు చేసిన మస్క్, ఏ రాజకీయ నాయకుల గురించి కూడా ఇలా ఎప్పుడూ చెప్పలేం అంటూ చివర్లో మరో బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు.

జార్జియా మెలొని గురించి ఎలాన్ మస్క్ చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యల వీడియో ఓవైపు, ఆ ఇద్దరూ ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకుంటున్నట్లుగా ఉన్న ఫోటో వైరల్ అవడం మరోవైపు.. వెరసి సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ ఫోటో, వీడియో కిందనే నెటిజెన్స్ కామెంట్స్ రాస్తూ, మెలోనితో ఎలాన్ మస్క్ డేటింగ్ చేస్తున్నారా అని సందేహం వ్యక్తంచేశారు.

మెలోనితో డేటింగ్ చేస్తున్నారా అని వస్తోన్న కామెంట్స్ పై టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. "వీఆర్ నాట్ డేటింగ్" అని ఎక్స్ వేదికగా స్పందిస్తూ సింపుల్‌గా మూడంటే మూడు ముక్కల్లో ఈ వైరల్ న్యూస్‌కి ఎండ్ కార్డు పడేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories