Breaking News - Pakistan Earthquake: పాకిస్తాన్‌ను వణికించిన భూకంపం

Earthquake in Pakistan Recorded on Recorded as 5.7 Intensity on Rechtor Scale | International News Today
x

Breaking News - Pakistan Earthquake: పాకిస్తాన్‌ను వణికించిన భూకంపం

Highlights

Breaking News - Pakistan Earthquake: *20 మంది మృతి.. పలువురికి గాయాలు *మృతుల్లో మహిళ సహా ఆరుగురు చిన్నారులు

Breaking News - Pakistan Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ప్రజలు నిద్రలో ఉన్న సమయంలో దక్షిణ పాకిస్థాన్‌లో ఈ ఉదయం భూమి ఒక్కసారిగా కంపించింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా 200 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో చాలామంది భవనం పైకప్పు, గోడలు కూలి మీదపడడం వల్లే మరణించారు. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో భూకంపం సంభవించిందని, రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.7గా నమోదైందని అధికారులు తెలిపారు.

భూ ప్రకంపన కారణంగా పర్వత నగరం హర్నాయిలో తీవ్ర నష్టం సంభవించింది. అక్కడ రోడ్డు, విద్యుత్, మొబైల్ సౌకర్యం అంతగా లేకపోవడంతో బాధితులను రక్షించడం రెస్క్యూ సిబ్బందికి ఇబ్బందిగా మారింది. భూకంపం కారణంగా 20 మంది వరకు చనిపోయినట్టు తమకు సమాచారం అందిందని బూలచిస్థాన్ హోమంత్రి తెలిపారు. మృతుల్లో మహిళ సహా ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ల కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్లను పంపిస్తున్నట్టు ప్రావిన్షియల్ సీనియర్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories