Indonesia - Earthquake: ఇండోనేషియాలో మరోసారి భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Earthquake in Indonesia Recorded as 7.3 Intensity on Richter Scale and Tsunami Warnings Issued | International News
x

Indonesia - Earthquake: ఇండోనేషియాలో మరోసారి భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Highlights

Indonesia - Earthquake: *7.3గా భూకంప తీవ్రత... *ప్రాణభయంతో ఇళ్లు వదిలి పారిపోతున్న ప్రజలు

Indonesia - Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. మౌమెరీ నగరానికి 112 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేల్‌పై 7.3గా భూకంప తీవ్రత నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఫ్లోరెస్ ద్వీపంలో సముద్రగర్భంలో 18.5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత కారణంగా ఇండోనేషియాలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సునామీ హెచ్చరికల నేపధ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి సముద్రానికి దూరంగా పారిపోతున్నారు.

మరోవైపు.. ఇండోనేషియా భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజలు పెద్ద ఎత్తున సముద్రానికి దూరంగా పరిపోతుండడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ వీడియోలతో పాటు.. ఇండోనేషియాకు చెందిన ఓ మందుబాబు వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రాణ భయంతో ప్రజలు ఇళ్లు వదిలి వెళ్లిపోతున్న వేళ.. ఆ మందుబాబు మాత్రం మద్యం బాటిళ్లు కిందపడకుండా పట్టుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories