భూమికి రెండో చంద్రుడు... సెప్టెంబర్ 29 నుంచి ఊహించని అద్భుతం!

Earth To Get A New Moon On September 29
x

భూమికి రెండో చంద్రుడు... సెప్టెంబర్ 29 నుంచి ఊహించని అద్భుతం!

Highlights

మినీ-మూన్ చిన్న ఆస్టరాయిడ్‌లా కనిపిస్తుందట. ఆ ఆస్టరాయిడ్ పేరు 2024-పీటీ5.

సెప్టెంబర్ 29 ఆదివారం నాడు భూమికి రెండో చంద్రుడు కనిపిస్తాడని నాసా ప్రకటించింది. ఈ మినీ-మూన్ చిన్న ఆస్టరాయిడ్‌లా కనిపిస్తుందట. ఆ ఆస్టరాయిడ్ పేరు 2024-పీటీ5. ఇది మామూలుగా ఆస్టరాయిడ్ బెల్టులో భాగంగా భూమిని అనుసరిస్తూ సూర్యుడి చుట్టు తిరుగుతుంది.

ఈ విశ్వంలో భూమికి దగ్గరి నేస్తమైన చంద్రుడు 400 కోట్ల సంవత్సరాల నుంచి పుడమి చుట్టూ ప్రదక్షిణలుచేస్తున్నాడు. అయితే, ఇప్పుడు కొత్తగా కనిపించబోతున్న మినీ చంద్రుడు మాత్రం తాత్కాలికంగా వచ్చి వెళ్ళిపోతాడు.

నాసా జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ హొరైజాన్స్ నుంచి లభించిన తాజా సమాచారం ప్రకారం ఈ మినీ చంద్రుడు భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్థరాత్రి దాటాక అంటే 1.24 నిమిషాల నుంచి, నవంబర్ 25 రాత్రి 9.13 గంటల వరకు కనిపిస్తుందని మాడ్రిడ్ యూనివర్సిటీ ప్రొఫెసర్, మినీ మూన్ నిపుణుడు కార్లోస్ ఫ్యుయెంట్ మార్కోస్ space.com తో చెప్పారు.

“ఇప్పుడు మనకు చిట్టి చంద్రుడిలా కనిపించబోతున్న పదార్థం అర్జున ఆస్టరాయిడ్ బెల్ట్‌కు చెందినది. విశ్వంలోని ఈ రాళ్ళ సమూహాన్ని సెకండరీ ఆస్టరాయిడ్ బెల్ట్ అంటున్నారు. ఈ సమూహం కూడా భూమి తరహాలోనే సూర్యుడి చుట్టూ 15 కోట్ల కిలోమీటర్లు పరిభ్రిమిస్తుంది” అని మార్కోస్ వివరించారు. ఈ అర్జున ఆస్టరాయిడ్ బెల్ట్ అనేది భూమికి దగ్గరలో ఉన్న విశ్వ శిలలు, తోక చుక్కల సముహం.

భూమికి మరో చంద్రుడు దర్శనం ఇవ్వబోతున్నాడన్నది వినడానికి చాలా ఎగ్జయిటింగా ఉన్నప్పటికీ, ఇలాంటి గురుత్వాకర్షణ ఘటనలు నిజానికి తరచూ జరుగుతూనే ఉంటాయి. అర్జున బెల్ట్ లోని కొన్ని ఆస్టరాయిడ్స్ భూమికి 45 లక్షల కిలోమీటర్ల చేరువలోకి వస్తుంటాయి. వీటి వేగం కూడా తక్కువగానే అంటే గంటకు 3,540 కిలోమీటర్ల వేగంతో వస్తుంటాయి. ఇప్పుడు మినీ మూన్‌గా వ్యవహరిస్తున్న ఆస్టరాయిడ్ 2024 పీటీ5 భూమి చుట్టూ పూర్తిగా పరిభ్రమించదు. చంద్రుడి లాంటి నిజమైన ఉప గ్రహాన్ని మనం మాల్‌లో షాపింగ్ చేసే కస్టమర్ అనుకుంటే, ఈ మినీ మూన్‌ను విండో షాపర్ అనుకోవచ్చు.

భూమికి దగ్గరగా అతిథిలా వచ్చే ఈ ఆస్టరాయిడ్ తరువాత కనిపించకుండా పోయినా అర్జున ఫ్యామిలీ ఆస్టరాయిడ్స్‌తో కలిసి సూర్యుడి చుట్టూ మాత్రం పరిభ్రమిస్తూనే ఉంటుంది.

చంద్రుడు నెలలో పదిహేను రోజులు తన వెన్నెల వెలుగులతో భూమిని ప్రభావితం చేస్తుంటాడు. కానీ, ఈ 2024 పీటీ5 మినీ మూన్‌కు మాత్రం అలాంటి ఎఫెక్స్ట్ ఏమీ ఉండవు. మామూలుగా ఆకాశంలోకి చూస్తే కూడా ఇది కనిపించదు. అయితే, ఖగోళ శాస్త్రజ్జ్ఞలు మాత్రం ఈ అద్భుతాన్ని ప్రత్యేక పరికరాలతో ఫోటోలు తీసి మనకు అందిస్తారు. భూమికి సమీపంలో చంద్రుడికి పక్కన మరో చంద్రుడున్న అద్భుతాన్ని మనం ఆ స్పెషల్ ఫోటోలలో చూడవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories