North Korea: ఉక్రెయిన్‎పై యుద్దం.. పదుల సంఖ్యలో 'కిమ్‌' సైనికులు దుర్మరణం

North Korea: ఉక్రెయిన్‎పై యుద్దం.. పదుల సంఖ్యలో కిమ్‌ సైనికులు దుర్మరణం
x
Highlights

North Korea: ఉక్రెయిన్ పై జరుగుతున్న యుద్దంలో రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా సైన్యం పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కుర్క్స్ సరిహద్దు...

North Korea: ఉక్రెయిన్ పై జరుగుతున్న యుద్దంలో రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా సైన్యం పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కుర్క్స్ సరిహద్దు గ్రామాల్లో మోహరించిన కిమ్ సైనంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది జాడలేకుండా పోయినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. దాదాపు 30 మంది మరణించడమూ లేదా తీవ్రంగా గాయపడటమో జరిగిందని ఉక్రెయిన్ సైనిక నిఘా సంస్థ తెలిపింది.

ఉక్రెయిన్ చొరబాటును అరికట్టేందుకు ప్రయత్నిస్తూన్న రష్యా సరిహద్దు ప్రాంతమైన కుర్క్స్ లో భారీ స్థాయిల సైన్యాన్ని మోహరించింది. దీనిలో భాగంగా దాదాపు మూడుగ్రామాల్లో కిమ్ సైనికులు పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే 30 మంది మరణించడం లేదా తీవ్రగాయాలపాలైనట్లు ఉక్రెయిన్ నిఘా సంస్థ తెలిపింది. మరో ముగ్గురి ఆచూకీ లేకుండా పోయిందని తెలిపింది. ఈ యుద్దంలో ఉత్తర కొరియా సైనికులు మరణించినట్లు వార్తలు రావడం ఇదే మొదటి సారి. అయితే వీటిపై రష్యా అధికారికంగా ఇంకా స్పందించలేదు.

కాగా ఉక్రెయిన్ పై దండయాత్రకు రష్యాకు పూర్తిగా మద్దతు పలుకుతూ కిమ్..భారీ సంఖ్యలో ఆయుధ సామాగ్రితో సైనిక సహాయాన్ని అందిస్తూ వస్తున్నాడు. ఇప్పటికే వేల సంఖ్యలో సైనికులను రష్యాకు పంపించినట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నారు. దాదాపు 11వేల మంది ఉత్తర కొరియా సైనికులు తూర్పు రష్యాలో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు ఉక్రెయిన్ తోపాటు పెంటగాన్ వర్గాలు తెలిపాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories