కాలజ్ఞానులు చెప్పింది నిజం కానున్నదా.. ప్రపంచాన్ని జలప్రళయం ముంచేయనున్నదా?

Doomsday Glacier in Antarctica Could Melt Faster Than Anticipated
x

కాలజ్ఞానులు చెప్పింది నిజం కానున్నదా.. ప్రపంచాన్ని జలప్రళయం ముంచేయనున్నదా?

Highlights

Antarctica: నోస్ట్రడామస్, వీరభ్రహ్మేంద్రులు చెప్పిన కాలజ్ఞానం నిజమవుతోందా?

Antarctica: నోస్ట్రడామస్, వీరభ్రహ్మేంద్రులు చెప్పిన కాలజ్ఞానం నిజమవుతోందా? ప్రపంచాన్ని జలప్రళయం ముంచేయనున్నదా? అంటే తాజాగా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. అంటార్కిటికా ఖండంలోని పశ్చిమ భాగంలోని అత్యంత భారీ మంచుకొండతో ప్రపంచానికి ప్రమాదం ముంచుకొస్తోంది. శతాబ్దాల పాటు స్థిరంగా నిలిచి ఉన్న ఈ మంచుకొండ కొంతకాలంగా శరవేంగా కరిగిపోతోంది. ఇది పూర్తిగా కరిగిపోతే ప్రపంచమంతా సముద్రమట్టం ఏకంగా 3 మీటర్లు పెరిగి తీర ప్రాంతాల్లో 60 మైళ్ల పరిధిలో చాలావరకు నామరూపాల్లేకుండా మునిగిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనింతటికి కారణం వాతావరణ మార్పులేనని నిపుణులు చెబుతున్నారు.

మనకు పోతులూరి వీరభ్రహ్మేంద్ర స్వామి, ఐరోపాకు చెందిన నోస్ట్రడామస్‌ భవిష్యత్తును ముందే ఊహించి కాలజ్ఞానాన్ని అందించారు. వారి లెక్కల ప్రకారం 2018 నుంచి విపత్తులు ఆరంభమై ప్రళయానికి దారులు తీస్తాయని తెలిపారు. కాలజ్ఞానులు చెప్పినట్టుగానే తాజా పరిణామాలు జరుగుతున్నాయి మంచు కురిసే ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిత్యం ప్రవహించే నదులు పూర్తిగా ఎండిపోతున్నాయి. మంచు కొండలు భారీగా కరిగిపోతున్నాయి. అటు ఆర్కిటిక్‌, అంటార్కిటికా ఖండాలతో పాటు ఇటు మన దేశంలోని హిమాలయ పర్వతాల్లోని మంచు ద్రవీభవిస్తోంది. పాకిస్థాన్‌, చైనాతో పాటు పలు దేశాల్లో వరదలు ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. తీవ్రమైన కరువు కాటకాలు భయపెడుతున్నాయి. ఎప్పుడూ చూడని వింత సంఘటనలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ పరిణామాలకు కారణం వాతావరణంలోని మార్పులేనని నిపుణులు విశ్లేస్తున్నారు. అయితే ఇవే ప్రళయానికి కారణమా? నిపుణులు ఏమంటున్నారు? జలప్రళయంతో ఏం జరుగుతోందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు?

వాతావరణంలో మార్పులు ఇటీవల కాలంగా తీవ్రమయ్యాయి. మనుషుల చర్యల కారణంగా గ్రీన్‌ హౌస్‌ వాయువుల ఉద్ఘారాలు భారీగా పెరిగాయి. సూర్యుడి నుంచి వెలువడే ఉష్ణోగ్రతను పరావర్తనం చెందకుండా చేస్తాయి. ఫలితంగా భూమి మరింత వేడెక్కుతోంది. భూమి సగటు ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్‌ ఉండేది గత 22 ఏళ్లలో ఒక డిగ్రీ సెంటిగ్రేడ్‌ అధికమైంది. దీంతో ధ్రువాల్లో మంచు కరుగుతోంది. అంటార్కిటికా ఖండంలోని పశ్చిమ భాగంలోని అత్యంత భారీ మంచుకొండ థ్వాయిట్స్‌ వేగంగా కరిగిపోతోంది. దీని వైశాల్యం లక్షా 92వేల చదరపు కిలోమీటర్లు. అంటే దాదాపు గ్రేట్‌ బ్రిటన్‌ అంత పెద్దది అన్నమాట. దీని మందం 4 కిలోమీటర్లు 2 కిలోమీటర్ల మేర సముద్రంలో ఉంటుంది మిగిలిన రెండు కిలోమీటర్ల తేలి ఉంటుంది. ఇప్పుడు ఇది క్రమంగా కరిగిపోతోంది. థ్వాయిట్స్‌ 200 ఏళ్లుగా కరిగిన దాని కంటే తాజాగా మరింత వేగంగా కరిగిపోతున్నట్టు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అంటార్కిటికాలోని మంచుపై అమెరికా, బ్రిటన్‌, స్వీడన్‌ శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. తాజా వివరాలను నేచర్‌ జియోసైన్స్‌ అనే జర్నల్‌‌లో వెల్లడించారు. థ్వాయిట్‌ మంచుకొండ ఏటా ఎంత కరుగుతోంది? మొత్తం ఈ మంచుకొండ కరిగితే ఏం జరుగుతోంది? ప్రళయం ఎక్కడ సంభవిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు?

శాస్త్రవేత్తలు అత్యాధునిక పరికరాలతో థ్వాయిట్స్‌ మంచుకొండ పరిమాణాన్ని గణించారు. ఈ మంచుకొండ ఏటా 2.1 కిలోమీటర్ల మేర కరిగిపోతున్నట్టు నిర్ధారించారు. దాదాపు ఈ మంచుకొండ అంత్యదశకు చేరుకుంటున్నట్టు చెబుతున్నారు. సమీప భవిష్యత్తులో భారీగా మార్పులు చెందే అవకాశం ఉందని వివరిస్తున్నారు. అంటే ప్రమాదం ముంచుకొస్తున్నదని హెచ్చరిస్తున్నారు. అందుకే థ్వాయిట్స్‌‌ను ప్రళయకాల హిమానీనదంగా శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. ఈ మొత్తం మంచుకొండ కరిగిపోతే ప్రపంచమంతటా సముద్ర మట్టం ఏకంగా 3 మీటర్ల మేర పెరుగుతోందట అదే జరిగితే సముద్రతీరానికి 60 మైళ్ల పరిధిలోని భూభాగాలు నామరూపాలు లేకుండా మునిగిపోతాయట. ప్రపంచ వ్యాప్తంగా సముద్ర మట్టాల పెరుగుదలలో ధ్వాయిట్స్‌ మంచుకొండ వాటానే అధికంగా ఉందట. మనుషులకు, ఇతర జీవజాలానికి పెను ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం ప్రపంచ జనాభాలో 40 శాతం మంది సముద్రతీరంలోనే నివశిస్తున్నారు. సముద్ర మట్టం పెరిగితే వారందరి ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది.

నిజానికి భూతాపం ఒక్క డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగినా వాతావరణం అల్లకల్లోలంగా మారుతుంది. భూమి మీద మంచి నీటిలో మూడోవంతు ఈ మంచు కొండల రూపంలోనే ఉంటుంది. ఉష్ణోగ్రత పెరిగితే అంటార్కిటికా తోపాటు ఆర్కిటికాపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. ఆర్కిటిక్‌లోని గ్రీన్‌లాండ్‌ మంచుఫలకం వేగంగా కరుగుతోంది. అక్కడ ఏకంగా వందల టన్నుల మంచు కరిగి సముద్రంలో కలుస్తోంది. అది పూర్తిగా కరిగితే ఏడున్నర మీటర్ల సుముద్ర మట్టం పెరుగుతుంది. హిమాలయాల్లో మంచు కూడా వేగంగా కరిగిపోతోంది. మంచు విరిగి పడి ఉన్నఫళంగా వరదలు ముంచెత్తుతున్నాయి. ఇటీవల అమర్‌నాథ్‌లో, పాకిస్థాన్‌లో వరదలకు ఈ మంచు కొండలు విరిగిపడడమే కారణం. హిమాలయాలు కరగడంతోనే పాకిస్థాన్‌ సగానికి పైగా జలమయం అయ్యింది. వాతారవణంలో మార్పులు ఇలాగే కొనసాగితే మాత్రం పాకిస్థాన్‌ నామరూపాల్లేకుండా పోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వరదల కారణంగా పాకిస్థాన్‌ మొత్తం అతలాకుతలమైంది. 13 వందల మందికి పైగా ప్రజలు వరదల్లో ప్రాణాలు కోల్పోయారు. వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది.

మంచు క్రమంగా కరిగిపోతుండడంతో జల ప్రళయం ముంచుకొస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరిగిపోతున్న మంచును ఆపే ప్రయత్నం చేయాలని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రపంచ దేశాలు కంటి తుడుపు చర్యలను చేపడుతున్నాయి. మానవాళి వినాశనానికి మార్గాలు వేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories