Trump wears mask for first time: తొలిసారి మాస్కుతో డొనాల్డ్ ట్రంప్‌!

Trump wears mask for first time: తొలిసారి మాస్కుతో డొనాల్డ్ ట్రంప్‌!
x
Trump wears mask for first time
Highlights

Trump wears mask for first time: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తొలిసారి మాస్క్ తో ప్రజల ముందుకు వచ్చారు. వాషింగ్టన్ స‌మీపంలోని వాల్టర్ రీడ్ మిల‌ట‌రీ ఆసుప‌త్రి సంద‌ర్శన స‌మ‌యంలో భాగంగా అయన మాస్కుతో కనిపించారు.

Trump wears mask for first time: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తొలిసారి మాస్క్ తో ప్రజల ముందుకు వచ్చారు. వాషింగ్టన్ స‌మీపంలోని వాల్టర్ రీడ్ మిల‌ట‌రీ ఆసుప‌త్రి సంద‌ర్శన స‌మ‌యంలో భాగంగా అయన మాస్కుతో కనిపించారు.. అయితే వైద్యుల సూచన మేరకే ట్రంప్ మాస్కు ధరించినట్టుగా తెలుస్తోంది. అగ్రరాజ్యంలో కరోనా కేసుల పెరుగుతున్న క్రమంలో అమెరికాలో అధ్యక్షుడిని మాస్కు ధరించాల్సిందిగా అధికారులు, వైద్యులు ఎన్నిసార్లు చెప్పినా ఆయన అందుకు నిరాకరిస్తూనే వచ్చారు.. గ‌తంలో ఒక్కసారి ఫోర్డ్ ప్లాంటును సంద‌ర్శించినప్పుడు ట్రంప్ కొద్దిసేపు మాస్కును ధరించిన సంగతి తెలిసిందే..

కొవిడ్ రోగులకు వైద్యం అందిస్తూ అనారోగ్యానికి గురైన ఆరోగ్య సంర‌క్షకులు, స్వచ్ఛంద సేవా స‌భ్యుల‌ను ప‌రామర్శించడానికి తాజాగా మిల‌ట‌రీ ఆసుప‌త్రికి ట్రంప్ వెళ్లారు ట్రంప్ . ఈ సందర్భంగా ట్రంప్ మరోసారి మాస్క్ ధరించారు. ఈ సందర్భంగా అయన మాట్లడుతూ.. 'ఆసుప‌త్రుల‌కు వెళ్లే స‌మ‌యంలో మాస్కు ధ‌రించ‌డం అత్యంత ముఖ్యమైన విష‌యంగా నేను భావిస్తున్నాను' అని మీడియాకి ట్రంప్ వెల్లడించారు.

ట్రంప్ పై విమర్శలు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నప్పటికీ ట్రంప్ దాన్ని నిర్లక్ష్యం చేస్తూనే వచ్చారు. అయితే తాజాగా అయన మాస్క్ ధరించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఎన్నిక‌ల‌ ప్రచారాంశంగానే ట్రంప్ మాస్క్ ధరించారని డెమోక్రటిక్ నేత జో బైడెన్ అభిప్రాయపడ్డారు.

ఇక అటు అగ్రరాజ్యంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఆ దేశంలో 32ల‌క్షల పాజిటివ్ కేసులు న‌మోదుకాగా, అందులో ల‌క్షా 34వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories