అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్‌ ట్రంప్' నకు‌ నోబెల్ బహుమతి!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ నకు‌ నోబెల్ బహుమతి!
x
Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నోబెల్ శాంతి బహుమతి 2021కి నామినేట్ అయ్యారు. అమెరికా అధ్యక్షుడి పేరును నార్వేజియన్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నోబెల్ శాంతి బహుమతి 2021కి నామినేట్ అయ్యారు. అమెరికా అధ్యక్షుడి పేరును నార్వేజియన్ రాజకీయ నాయకుడు క్రిస్టియన్ టైబ్రింగ్-జెడ్డే ప్రతిపాదించినట్టు ఫాక్స్ న్యూస్ తెలిపింది. ఇజ్రాయెల్‌, UAEల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చినందుకు గాను ట్రైబిడ్రే జెడ్డే... ట్రంప్‌ పేరును నోబెల్ నామినేట్ చేశారు. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడి హోదాలో ఇరు దేశాల మధ్య సామరస్యం నెలకొనేలా వ్యవహరించారని ఆయన వెల్లడించారు. ఇదేకాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక సమస్యల పరిష్కారానికి ట్రంప్‌ ఎంతగానో కృషి చేశారని.. ట్రంప్‌ను ప్రశంసించారు టైబ్రింగ్-జెడ్డే. 2020 లో శాంతి నోబెల్ బహుమతికి 318 మంది అభ్యర్థుల పేర్లు వచ్చారు. కాగా 2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నోబెల్ శాంతి బహుమతి లభించింది.

ఇదిలావుంటే నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకోవడానికి అవసరమైన మూడు షరతులను ట్రంప్ నెరవేర్చారని నార్వే ఎంపి అన్నారు. మొదటిది దేశాల మధ్య ఫెలోషిప్ ను చర్చల ద్వారా చేసాడు" అని ఆయన అన్నారు. సరిహద్దు వివాదాలను పరిష్కరించడానికి ట్రంప్ కృషి చేశాడని.. ఈ సందర్బంగా ఇండో-పాక్ , ఇండో-చైనా వివాదాలను పరిష్కరించడానికి కూడా ప్రయత్నించారని ఆయన అన్నారు. ఇక ఇప్పటికే నలుగురు అమెరికా అధ్యక్షులు నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు, నార్వేజియన్ పార్లమెంట్ నియమించిన ఐదుగురు వ్యక్తుల నోబెల్ కమిటీ అవార్డును నిర్ణయిస్తుంది. బరాక్ ఒబామా 2009 లో, 1906 లో థియోడర్ రూజ్‌వెల్ట్, 1920 లో వుడ్రో విల్సన్ , 2002 లో జిమ్మీ కార్టర్ , 2021 కి గాను ట్రంప్ ను నామినేట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories