Donald trump executive orders: మరో‌ కీలక నిర్ణయం తీసుకున్న డొనాల్డ్‌ ట్రంప్

Donald trump executive orders: మరో‌ కీలక నిర్ణయం తీసుకున్న డొనాల్డ్‌ ట్రంప్
x
Highlights

Donald trump executive orders:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ మరో‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో స్మారక చిహ్నాలు, స్మారక చిహ్నాలు మరియు విగ్రహాలను రక్షించడానికి కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసినట్లు ట్రంప్ శుక్రవారం ప్రకటించారు.

Donald trump executive orders: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ మరో‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో స్మారక చిహ్నాలు, స్మారక చిహ్నాలు మరియు విగ్రహాలను రక్షించడానికి కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసినట్లు ట్రంప్ శుక్రవారం ప్రకటించారు. దీనిప్రకారం విగ్రహాలను ధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రంప్ ప్రకటించారు. దీనిపై సంతకం చేసిన ట్రంప్ అనంతరం ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అందులో ఇలా పేర్కొన్నారు.. "అమెరికన్ స్మారక చిహ్నాలు, స్మారక చిహ్నాలు మరియు విగ్రహాలను రక్షించే చాలా బలమైన కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసే హక్కు నాకు లభించింది.. చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడేవారికి కఠిన కారాగార శిక్షలు ఉంటాయి అని ట్రంప్ ట్వీట్లో పేర్కొన్నారు.

మరోవైపు ఇందుకోసం ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ టీంను కూడా ఏర్పాటు చేశారు ట్రంప్.. ఈ టాస్క్‌ఫోర్స్‌కు న్యూజెర్సీ జిల్లా అటార్నీ క్రెయిగ్ కార్పెనిటో , ఉత్తర టెక్సాస్ జిల్లాకు చెందిన యుఎస్ అటార్నీ ఎరిన్ నీలీ కాక్స్ నాయకత్వం వహిస్తారని తెలిపారు. కాగా మే నెల చివరలో జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్య అనంతరం చోటు చేసుకున్న నిరసనల్లో చారిత్రాత్మక కట్టడాలు మరియు విగ్రహాలను ధ్వంసం చేశారు. అంతేకాదు వైట్‌ హౌస్‌ దగ్గరలోని మాజీ అధ్యక్షుడు ఆండ్రూ జాక్‌సన్‌ విగ్రహాన్ని, వాషింగ్టన్‌లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories