కరోనా రోగిని హత్తుకున్న డాక్టర్ : సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫొటో

కరోనా రోగిని హత్తుకున్న డాక్టర్ : సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫొటో
x
Highlights

ఎవరికైనా కరోనా పాజిటివ్ అంటే చాలు.. కిలోమీటర్ దూరం పరిగెడుతున్నారు చాలామంది ! అలాంటిది డాక్టర్లు కంటిరెప్పలా చూసుకుంటున్నారు రోగులని ! అందుకే ఇప్పుడు...

ఎవరికైనా కరోనా పాజిటివ్ అంటే చాలు.. కిలోమీటర్ దూరం పరిగెడుతున్నారు చాలామంది ! అలాంటిది డాక్టర్లు కంటిరెప్పలా చూసుకుంటున్నారు రోగులని ! అందుకే ఇప్పుడు దేవుళ్లయ్యారు వాళ్లంతా ! ఐతే కరోనా సంక్షోభ సమయంలో ఓ డాక్టర్, రోగి మధ్య చోటుచేసుకున్న సన్నివేశం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఎదురుగా కొవిడ్ రోగి కన్నీరుపెట్టుకుంటుంటే చలించిన డాక్టర్ తన ఆరోగ్యం గురించి ఆలోచించకుండా ఆత్మీయంగా హత్తుకునే దృశ్యం నెటిజన్ల మనసులు గెలుచుకుంటోంది. హూస్టన్‌లో యునైటెడ్ మెమోరియల్ సెంటర్‌లో చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేస్తున్న జోసెఫ్ వరోన్‌ 250రోజులుగా విరామం లేకుండా పనిచేస్తున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడు తీవ్ర కలవరపాటుతో ఉండటం ఆయన కంటపడింది. వెళ్లి పలకరించగా ఒక్కసారిగా బోరమన్నాడు. ఆ వృద్ధుడి కష్టం చూసి కదిలిపోయిన వరోన్ అతన్ని కౌగిలించుకున్నాడు. ఎవరో ఈ ఫొటోను క్లిక్‌మనిపించగా అది ఇప్పుడు వైరల్ అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories