15 రోజుల్లోగా ఆమె దేశం విడిచి వెళ్ళాలి : పాక్ ప్రభుత్వం

15 రోజుల్లోగా ఆమె దేశం విడిచి వెళ్ళాలి : పాక్ ప్రభుత్వం
x
Highlights

ప్రముఖ అమెరికన్ బ్లాగర్ సింథియా రిచీ పై పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది..

ప్రముఖ అమెరికన్ బ్లాగర్ సింథియా రిచీ పై పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆమెను 15 రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. మాజీ హోంమంత్రి రెహమాన్ మాలిక్, మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీపై దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు రిచీ జూన్లో ఆరోపించిన సంగతి తెలిసిందే. వీసా పొడిగింపు కోసం రిచీ చేసిన విజ్ఞప్తిపై ఇస్లామాబాద్ హైకోర్టులో మంగళవారం విచారణ ప్రారంభమైంది. ఈ కేసును త్వరలో విచారించాలని హైకోర్టు ట్రయల్ కోర్టును కోరింది. రిచీ 11 సంవత్సరాలపాటు పాకిస్తాన్‌లో ఉన్నారు. ఆమె పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో , అలాగే తదుపరి ప్రభుత్వాలతో కలిసి పనిచేశారు. 2011 నుండి 2014 వరకు రిచీ పాకిస్తాన్ రాష్ట్రపతి భవన్ లో నివసించారు.

వీసా వ్యవహారం కోర్టులో ఉన్నప్పటికీ, రిచీని 15 రోజుల్లో దేశం విడిచి వెళ్ళమని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ బుధవారం సాయంత్రం ఆదేశించింది. ఆమె వీసా పొడిగింపు డిమాండ్ ను కూడా మంత్రిత్వ శాఖ తిరస్కరించబడింది. జూలై 10 న, ఇస్లామాబాద్ హైకోర్టు రిచీ చేస్తున్న ఆరోపణలు రాజకీయ ప్రేరణతో ఉన్నట్లు అంగీకరించాయి. ఆమెను అమెరికాకు పంపాలని పాక్ లోని పలువురు రాజకీయ నాయకులు డిమాండ్ చేశారు. మరోవైపు పాకిస్తాన్‌ను విడిచి వెళ్ళమని ఆర్డర్ వచ్చిన తరువాత, సింథియా రిచీ ఇలా వ్యాఖ్యానించారు.. తాను ఏ నియమాలను ఉల్లంఘించానో మంత్రిత్వ శాఖ చెప్పాలని.. ఇది పూర్తిగా ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయం అని ఆమె అన్నారు. తనకు వర్క్ వీసా ఉందని ఈ ఉత్తర్వును కోర్టులో ఖచ్చితంగా సవాలు చేస్తానని ఆమె అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories