Airborne Spread Of Coronavirus: గాలి ద్వారా వ్యాప్తిస్తున్న వైరస్ : డబ్ల్యూహెచ్ఓ ఏమి చెప్పిందంటే..

Airborne Spread Of Coronavirus: గాలి ద్వారా వ్యాప్తిస్తున్న వైరస్ : డబ్ల్యూహెచ్ఓ ఏమి చెప్పిందంటే..
x
Airborne Spread Of Coronavirus
Highlights

Airborne Spread Of Coronavirus: కరోనావైరస్ గాలి నుండి కూడా వ్యాప్తి చెందుతుందన్న శాస్త్రవేత్తల అభిప్రాయాన్ని తోసిపుచ్చలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అభిప్రాయపడింది.

Airborne Spread Of Coronavirus: కరోనావైరస్ గాలి నుండి కూడా వ్యాప్తి చెందుతుందన్న శాస్త్రవేత్తల అభిప్రాయాన్ని తోసిపుచ్చలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అభిప్రాయపడింది. దీనిపై డబ్ల్యూహెచ్‌ఓ టెక్నికల్ లీడ్ మరియా వాన్ కెర్ఖోవ్ మాట్లాడుతూ.. కరోనావైరస్ గాలి ద్వారా ప్రసారం అవుతుందనే వాదనను తోసిపుచ్చలేమని పేర్కొన్నారు. ముక్కు మరియు నోటి ద్వారా సంక్రమణ వ్యాపిస్తుందని WHO గతంలో పేర్కొందని. అలాగే వైరస్ సోకిన ఉపరితలాన్ని తాకడం ద్వారా కూడా వ్యాపిస్తుందని ఆయన అన్నారు.. అలాగే డబ్ల్యూహెచ్‌ఓ అధికారి బెనెడెట్టా అలెన్‌గ్రాంజీ మాట్లాడుతూ.. కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందనడానికి ఆధారాలు ఉన్నాయని, అయితే దీని నిర్ధారణకు సమయం పడుతుందని చెప్పారు. అంతేకాదు బహిరంగ ప్రదేశాల్లో గాలి ద్వారా కరోనా సంక్రమణ వ్యాప్తి చెందే అవకాశాన్ని తోసిపుచ్చలేమని ఆయన అన్నారు. ముఖ్యంగా ఎక్కువ రద్దీ ఉన్న ప్రదేశాలలో ఇది జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

కాగా కరోనా గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని 32 దేశాలలోని 239 మంది శాస్త్రవేత్తలు ఇటీవల డబ్ల్యూహెచ్‌ఓ కు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల నుండి కరోనావైరస్ యొక్క చిన్న కణాలు అంటే సార్స్ COV-2 లు చాలా గంటలపాటు గాలిలో ఉండి, అవి ప్రజలకు సోకుతున్నట్టు గుర్తించారు. కరోనా కణాలు గాలిలో 8 నుండి 13 అడుగుల వరకు ప్రయాణించగలవని భారతీయ మరియు అమెరికన్ పరిశోధకుల బృందాలు చెబుతున్నాయి. అయితే అది కూడా 50 శాతం తేమ మరియు 29 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద, కరోనా కణాలు గాలిలో కరిగిపోతాయని కూడా తేల్చారు.


Show Full Article
Print Article
Next Story
More Stories