coronavirus:జాగ్రత్తలు పాటించకపోతే కరెన్సీ..మాస్కులతో ప్రమాదమే!

coronavirus:జాగ్రత్తలు పాటించకపోతే కరెన్సీ..మాస్కులతో ప్రమాదమే!
x
Highlights

మీ స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్‌ను శుభ్రం చేయకుండానే వాడుతున్నారా..? విచ్చలవిడిగా చేతితో కరెన్సీ నోట్లు లెక్కపెడుతున్నారా..? అయితే బీ కేర్‌ఫుల్ అంటున్నారు...

మీ స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్‌ను శుభ్రం చేయకుండానే వాడుతున్నారా..? విచ్చలవిడిగా చేతితో కరెన్సీ నోట్లు లెక్కపెడుతున్నారా..? అయితే బీ కేర్‌ఫుల్ అంటున్నారు వైద్య నిపుణులు. ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయకుంటే కరెన్సీ రోజూ వాడే వస్తువుల నుంచి కూడా కరోనా సోకుతుందని చెబుతున్నారు. కరోనాపై కొత్త కొత్త విషయాలు చెబుతోన్న సైంటిస్టులు తాజాగా ఈ షాకింగ్‌ న్యూస్‌ను వెల్లడించారు.

కరోనా వైరస్‌ స్మార్ట్ ఫోన్ స్క్రీన్లు, బ్యాంకు నోట్లపై 28 రోజుల వరకు బతకగలదని సైంటిస్టులు చెబుతున్నారు. ప్లాస్టిక్ నోట్ల కన్నా పేపర్ నోట్లపై ఇంకా ఎక్కువ కాలం ఉంటుందని తెలిపారు. కాటన్ లాంటి చిన్న చిన్న రంధ్రాలుండే బట్టలతో పోల్చితే మృదువుగా ఉండే గ్లాస్‌, వినైల్, స్టెయిన్లెస్ స్టీల్ పై చాలా కాలం యాక్టివ్ గా ఉండగలదంటున్నారు. ఆస్ట్రేలియన్ నేషనల్ సైన్స్ ఏజెన్సీ సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మృదువైన స్క్రీన్లు, నోట్లపై ఇన్‌ఫ్లుయంజా 17 రోజులు బతకగలిగితే కరోనా వైరస్ మాత్రం 28 రోజులు ఉంటుందంటున్నారు. డైరెక్ట్ సలైట్ బట్ట వైరస్ ను ఇనాక్టివేట్ చేస్తుందని తెలిపారు. అయితే వస్తువుల సర్ఫేస్ నుంచి వైరస్ ఎంత మేరకు వ్యాపిస్తుంది..? వ్యాప్తి చెందడాని ఒకసారికి ఎంత శాతం వైరస్లు అవసరమవుతాయనేది తెలుసుకోవాల్సి ఉందంటున్నారు వైద్యులు. ఫోన్‌ స్క్రీన్లు, మాస్కుల విషయంలో శానిటైజేషన్‌ తప్పనిసరి అంటున్నారు.

బట్ట మాస్కులు వైరస్ ను అడ్డుకోగలవని, అయితే రోజూ వాటిని అత్యధిక టెంపరేచర్లో ఉతకాలని వైద్యులు చెబుతున్నారు. ఏ మాస్కులైనా ఒకసారి వాడాక కలుషితమైనట్టే అని అంటున్నారు. 2015లో పబ్లిష్ చేసిన ర్యాండమైజ్డ్ కంట్రోల్‌లో ట్రయల్ స్టడీ వివరాలను హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది వాడే మాస్కులపై 2011 నాటి డేటానూ అనలైజ్ చేసి న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీ సైంటిస్టులు ఈ విషయాన్ని వెల్లడించారు. హాస్పిటల్ లాండ్రీలో వాష్ చేసిన క్లాత్ మాస్కులు సర్జికల్ మాస్కుల్లా ఎఫెక్టివ్ గా పని చేయగలవని, అదే చేతితో పిండితే మాత్రం ప్రొటెక్షన్ ఉండదని చెబుతున్నారు. ఇక డబ్ల్యూహెచ్‌వో కూడా 60 డిగ్రీల హాట్ వాటర్ లో మాస్కులను శుభ్రం చేయాలని సూచించింది. ఇక కోవిడ్ విషయంలో నిర్లక్ష‌్యం వద్దని హెచ్చరిస్తున్న డాక్టర్లు మాస్క్ లు, భౌతిక దూరం పాటించడంలో నిర్లక్ష్యం మంచి పరిణమం కాదంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories