Corona Effect: శ్రీలంక పార్లమెంటు ఎన్నికలు మరోసారి వాయిదా

Corona Effect: శ్రీలంక పార్లమెంటు ఎన్నికలు మరోసారి వాయిదా
x
Gotabaya Rajapaksa (file photo)
Highlights

శ్రీలంకలో పార్లమెంటు ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. జూన్ 20న జరగాల్సిన ఎన్నికలు ఆగస్టు 5న జరుగుతాయని జాతీయ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు...

శ్రీలంకలో పార్లమెంటు ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. జూన్ 20న జరగాల్సిన ఎన్నికలు ఆగస్టు 5న జరుగుతాయని జాతీయ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ చైర్మన్ మహీంద దేశప్రియ బుధవారం ప్రకటించారు. మార్చి 2 న శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే పార్లమెంటును రద్దు చేశారు, షెడ్యూల్ కంటే ఆరు నెలల ముందే, ఏప్రిల్ 25 న స్నాప్ పోల్స్ నిర్వహించాలని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

అయితే, కరోనావైరస్ కారణంగా ఏప్రిల్ మధ్యలో ఎన్నికల కమిషన్ ఎన్నికలను దాదాపు రెండు నెలల జూన్ 20 వరకు వాయిదా వేసింది. జూన్ 20న నిర్వహించాలని చూసిన కోవిడ్ మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఆగస్టుకు వాయిదా వేసింది. అయితే ఈసారి, ఎన్నికలలో సామాజిక దూరం పాటించడమే కాకుండా, మాస్కులు ధరించాలని ఎన్నికల కమిషన్ సూచించింది. కాగా శ్రీలంకలో ఇప్పటివరకు 1869 కేసులు నమోదయ్యాయి, 11 మంది మరణించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories