America: అమెరికాకు వచ్చే విద్యార్థులకు కీలక సూచనలు

Corona Negative Report Must TO Students WHO Coming TO America
x

America: అమెరికాకు వచ్చే విద్యార్థులకు కీలక సూచనలు

Highlights

America: అమెరికాకు వచ్చే విద్యార్థులకు మినిస్టర్ కౌన్సెలర్ ఆఫ్ కాన్సులర్ ఎఫైర్స్ కీలక సూచనలు చేసింది.

America: అమెరికాకు వచ్చే విద్యార్థులకు మినిస్టర్ కౌన్సెలర్ ఆఫ్ కాన్సులర్ ఎఫైర్స్ కీలక సూచనలు చేసింది. వ్యాక్సినేషన్ విష‍యంలో తమ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని, జూన్ 14 నుంచి యూఎస్ వీసా అపాయింట్‌మెంట్లు యథాతథంగా ఉంటాయిని స్పష్టం చేసింది. అమెరికాలో అడుగు పెట్టేందుకు వ్యాక్సినేషన్ అర్హత కానే కాదని తెలిపారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ అమెరికాలో అడ్మిషన్లు పొందిన విద్యార్థుల కోసం అమెరికన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. అదే సమయంలో అమెరికాకు రావాలనుకున్న పర్యాటకులు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఇప్పట్లో అనుమతి లేదని, అలాంటి వారు వీసాకు దరఖాస్తు చేసుకోకపోవడం ఉత్తమమని కాన్సులేట్ వర్గాలు సూచించాయి.

టీకాకు సంబంధించి అమెరికా ప్రభుత్వం ఎలాంటి సూచనలు ఇవ్వలేదని, ప్రయాణానికి మూడు రోజుల ముందు కరోనా నిర్దారణ పరీక్షలో నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి అని ఎంబసీ తెలిపింది. వ్యాక్సినేషన్ కోసం సంబంధిత యూనివర్శిటీ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కొన్ని యూనివర్శిటీలు మాత్రం వ్యాక్సిన్ తప్పనిసరి చెబుతున్నందున, దీనిపై ఆ వర్శిటీ అధికారులను సంప్రదించాల్సి ఉంటుందని చెప్పింది. ఇండియన్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ స్థానిక టీకా తప్పనిసరిగా వేసుకోవాలని సూచించింది. జూన్ 14 తరువాత ఉన్న అపాయంట్‌మెంట్లు యథావిధిగా కొనసాగుతాయని, అంతకంటే ముందు దరఖాస్తు చేసుకుని రద్దయినవారు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories