Corona: చైనాలో మరోసారి కరోనా విశ్వరూపం

Corona Cases Are Increasing In China
x

Corona: చైనాలో మరోసారి కరోనా విశ్వరూపం

Highlights

Corona: చైనాలో భారీ సంఖ్యలో కొత్త కేసుల నమోదు

Corona: చైనాలో కోవిడ్ మరోసారి కోరలు చాస్తోంది. మహమ్మారి విజృంభణకు ఒమిక్రాన్ ఉపరకమైన బీఎఫ్ 7 కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ వేరియంట్ భారత్‌లోకి ప్రవేశించడం ఆందోళన కలిగిస్తోంది. బీఎఫ్ 7 వేరియంట్‌తో ఇప్పటి వరకు భారత్‌లో మూడు కేసులు నమోదు అయ్యాయి. వీటిలో మొదటి కేసు అక్టోబర్‌లోనే గుజరాత్‌లో వెలుగు చూసింది. గుజరాత్‌లో రెండు కేసులు నమోదు కాగా మరో కేసు ఒడిశాలో వెలుగు చూసింది.

ఇండియాలో కొత్త వేరియంట్‌ వ్యాప్తితో కేంద్రం అప్రమత్తమైంది. కోవిడ్‌పై నిపుణులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా సమీక్షా సమావేశం నిర్వహించారు. బీఎఫ్ 7 వెలుగు చూపినప్పటికీ కేసుల్లో పెరుగుదల గణనీయంగా లేదని నిపుణులు వెల్లడించారు. వ్యాప్తిలో ఉన్న వాటితో పాటు కొత్తగా బయటపడుతున్న వేరియంట్లపై పర్యవేక్షణ అవసరమని సూచించారు.

పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తం అయింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీచేసింది. కొవిడ్ ఇంకా పూర్తిగా అంతరించిపోలేదని, అధికారులు నిశితంగా పరిశీలిస్తుండాలని పేర్కొంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మనదేశంలో భయపడాల్సిన అవసరంలేదని తెలిపింది. కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, రద్దీ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేసింది.

దేశంలో కరోనా పరిస్థితులపై ప్రతివారం సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ కు రీ ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం ఉందని కేంద్రం వెల్లడించింది. ఈ వేరియంట్ కు ఇంక్యుబేషన్ వ్యవధి కూడా చాలా తక్కువ అని తెలిపింది. ఏవైనా శాంపిల్స్ పాజిటివ్ వస్తే వాటికి తప్పనిసరిగా జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని రాష్ట్రాలకు సూచించింది. అమెరికా, బ్రిటన్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్ దేశాల్లోనూ బీఎఫ్-7 కేసులు ఉన్నట్టు వివరించింది. ఇకపై విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఎయిర్ పోర్టుల్లో నేటి నుంచే శాంపిల్స్ సేకరణ అమలవుతుందని పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories