Corona In China: చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు

Corona cases are increasing in China
x

చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు

Highlights

* కొత్త కేసులతో బీజింగ్‌లో పాక్షిక లాక్‌డౌన్.. 500కు పైగా కరోనా కేసులు నమోదు

Corona: చైనాలో కరోనా కేసుల సంఖ్య 25వేలు దాటడంతో మరోసారి పరిస్థితి ఆందోళకరంగా మారుతోంది. ఒక్క బీజింగ్‌లోనే 500కు పైగా కేసులు నమోదు కావడంతో సిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు సాధ్యమైనంత వరకు ఇళ్లకే పరిమితం కావాలని, రోజువారీ టెస్టింగ్‌లు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు రాకపోకలు కుదించుకోవాలని, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని పలు జిల్లాల అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

జనాభా అధికంగా ఉండే చవోయాంగ్ జిల్లాలో కేసులు గణనీయంగా ఉన్నట్టు జిల్లా అధికారులు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, కమర్షియల్ హబ్‌లు, వేలాది రెసిడెన్సియల్ కమ్యూనిటీలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. తప్పనిసరి అయితే కానీ ప్రజలు బయటకు వెళ్లవద్దని, ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే 48 గంటల్లోగా నెగిటివ్ వైరల్ డయాగ్నస్టిక్ పరీక్షలు చేయించుకుని వాటిని సమర్పించాల్సి ఉంటుందని అక్కడి అధికారిక మీడియా తెలిపింది.

చవోయాంగ్‌‌తో పాటు డాంగ్‌చెంగ్, జీచెంగ్, టాంగ్‌జవో, యాంకింగ్, చాంగ్‌పింగ్, హైడియాన్ తదితర జిల్లాల్లో అధికారిక మీడియా అకౌంట్లలో అంతర్ జల్లా పర్యటనలను తగ్గించుకోవాలంటూ లేఖలు అప్‌లోడ్ చేశారు. పెరుగుతున్న కరోనా కేసులను సమర్ధవంతంగా ఎదుర్కోవడం, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు బీజింగ్‌లోని కొన్ని ప్రధాన షాపింగ్ మాల్స్‌లో డైనింగ్-ఇన్-సర్వీస్‌ను రద్దు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories