చైనా యొక్క వైరల్ మహమ్మారి కరోనావైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. కొత్తగా సంభవించిన 38 మరణాలలో ముప్పై ఏడు, తీవ్రంగా దెబ్బతిన్న హుబీ ప్రావిన్స్‌లో...
చైనా యొక్క వైరల్ మహమ్మారి కరోనావైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. కొత్తగా సంభవించిన 38 మరణాలలో ముప్పై ఏడు, తీవ్రంగా దెబ్బతిన్న హుబీ ప్రావిన్స్‌లో సంభవించాయి, ఇది అంటువ్యాధికి నిలయంగా మారింది. ఇది ప్రపంచ భయాన్ని పెంచుతోంది. చైనాలో ఈ వైరస్ భారిన పడిన మరణించిన వారి సంఖ్య 170 కు చేరుకుందని ప్రభుత్వం గురువారం తెలిపింది. అంతేకాదు 1,700 కు పైగా కొత్త వ్యక్తులకు ఇన్ఫెక్షన్ సోకినట్టు నిర్ధారించారు. దీని ధాటికి ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్టాండులలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు.
ఒక్కరోజు వ్యవధిలోనే కొత్తగా 38 మరణాలు సంభవించాయి. అయితే అందులో ముప్పై ఏడు మరణాలు హుబీ ప్రావిన్స్‌లో నమోదయ్యాయని.. నైరుతి సిచువాన్ ప్రావిన్స్‌లో మరో మరణం సంభవించినట్లు జాతీయ ఆరోగ్య కమిషన్ నివేదించింది. హుబీ ప్రావిన్స్ ప్రాంతంలో ఈ వైరస్ బాగా ప్రబలింది. భారత్ కు చెందిన సుమారు 500 మంది పర్యాటకులు ఈ ప్రాంతంలో ఉన్నట్టు భారత ప్రభుత్వానికి నివేదికలు అందాయి.
ఈ ప్రాంతం అంటువ్యాధికి కేంద్రంగా ఉండటంతో భారతీయుల్ని వెనక్కి రప్పించేందుకు సాహసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హుబీ ప్రావిన్స్‌లో పదిలక్షల మంది ప్రజలను ఈ వైరస్ కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ వైరస్ ను నియంత్రించే ప్రయత్నాలు భారీగానే జరుగుతున్నాయి. ఒక్కరోజే ఈ ప్రాంతంలో 1,032 ల కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతం నుండి బుధవారం వందలాది మంది విదేశీయులను తరలించారు.ఈ అంటువ్యాధి డజనుకు పైగా దేశాలకు వ్యాపించింది, ఫిన్లాండ్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లలో ఈ లక్షణాలు కనబడ్డాయి.
మరోవైపు ఈ వైరల్ మహమ్మారిని ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించాలా వద్దా అనే దానిపై డబ్ల్యూహెచ్ఓ గురువారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలు ఇప్పటికే చైనాలో మరియు సంయుక్త రాష్ట్రాలలో సేవలను నిలిపివేస్తున్నాయి. దీంతో చైనాలో ఉన్న విదేశీ పర్యాటకులకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire