ఆధునిక యుద్ధంలో చమురు కీలక పాత్ర పోషిస్తుంది. చమురు ఉన్న దేశానికే యుద్ధంలో విజయం తథ్యం.
ఆధునిక యుద్ధంలో చమురు కీలక పాత్ర పోషిస్తుంది. చమురు ఉన్న దేశానికే యుద్ధంలో విజయం తథ్యం. చుమురుకు, యుద్ధానికి ఏం సంబంధం అనుకుంటున్నారా? సంబంధం ఉంది.. యుద్ధంలో సైన్యం తరలించాలన్నా.. యుద్ధ ట్యాంకులు దూసుకెళ్లాలన్నా.. గగనతలంలో దాడులు చేయాలంటే యుద్ధ విమానాలు గాల్లోకి ఎగరాలన్నా జల మార్గంలో యుద్ధ నౌకలు దూసుకెళ్లలాలన్నా ఇంధనం అత్యంత కీలకం అదే చమురే డ్రాగన్ కంట్రీని భయపెడుతోంది. ప్రధానంగా చమురు దిగుమతులను అమెరికా అడ్డుకుంటే మాత్రం డ్రాగన్ ఖేల్ ఖతమ్ అవుతుంది. ముందూ వెనుక ఆలోచించకుండా డ్రాగన్ రెక్కలు తెగడం ఖాయం అందుకే తైవాన్‌పై యుద్దం విషయంలో బీజింగ్ పునరాలోచనల్లో పడింది.
ప్రపంచంలోనే అత్యధికంగా చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో అమెరికా తరువాత రెండో స్థానంలో బీజింగ్ ఉంది. ప్రపంచ వినియోగంలో చైనా వాటా 13 శాతం అలాంటిది బీజింగ్ వద్ద ఉన్న చమురు నిల్వలు 1.5 శాతం మాత్రమే. ఫలితంగా చైనా భారీగా చుమురును దిగుమతి చేసుకుంటోంది. 72 శాతం ఇంధనాన్ని విదేశాల నుంచి డ్రాగన్ కంట్రీ దిగుమతి చేసుకుంటోంది. ఎంతలా అంటే రోజుకు కోటి 18 లక్షల బ్యారెళ్లను దిగుమతి చేసుకుంటోంది. ఇది సాధారణ రోజుల్లో దిగుమతుల వివరాలు మాత్రమే అదే యుద్ధ సమయంలో చమురు వినియోగం భారీగా పెరుగుతుంది. చైనా చివరిగా వియత్నాంతో 1979లో యుద్ధం చేసింది. ఇప్పుడు యుద్ధానికి దిగితే మాత్రం బీజింగ్ భారీగా చమురును కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 140 కోట్ల మంది చైనీయులకు, వారి యుద్ధ నౌకలకు, పరిశ్రమలకు చమురు అవసరం. దీంతో చైనా భారీగా విదేశాల నుంచి చుమరును కొనుగోలు చేస్తోంది. అత్యధికంగా సౌదీ అరేబియా నుంచి 17.4 శాతం, రష్యా నుంచి 15.6 శాతం, ఇరాక్ నుంచి 10.2 శాతం, ఓమన్ నుంచి 8.8 శాతం, అంగోలా నుంచి 7.5 శాతం, కువైట్ నుంచి 6.2 శాతం క్రూడాయిల్‌ను చైనా దిగుమతి చేసుకుటోంది. పశ్చిమాసియా దేశాల నుంచే 50 శాతం క్రూడాయిల్‌ను డ్రాగన్ కంట్రీ దిగుమతి చేసుకుంటోంది.
ఈ చమురును చైనా ఎలా దిగుమతి చేసుకుంటున్నదనేదే ఇప్పుడు అసలైన ప్రశ్న. రష్యా నుంచి మాత్రమే పైపులైన్ ద్వారా చమురు, గ్యాస్‌ను బీజింగ్ దిగుమతి చేసుకుంటుంది దాదాపు 60 శాతం సముద్ర మార్గంలో నౌకల ద్వారా దిగుమతి చేసుకుంటోంది. అయితే ఈ నౌకలు అత్యంత కీలకమైన మూడు మార్గాల్లో చైనాకు చేరుకుంటాయి. ఈ మూడింటిలో హార్మోజ్ జలసంధి. పర్షియన్ సముద్రం, ఓమన్ సముద్ర మధ్య ఈ హామోజ్ జలసంధి ఉంది. ఈ మార్గంలో నిత్యం 2 కోట్ల 10 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్ రవాణా అవుతోంది. రెండోది మలాక్కా జలసంధి. ఇది ఇండినేషియా, మలేషియా మధ్య ఉన్న జలసంధి. పశ్చిమాసియా దేశాల నుంచి సముద్ర మార్గంలో చైనాకు వెళ్లాలంటే మలాక్కా జలసంధి మార్గమే షార్ట్ కట్ రూట్ బీజింగ్‌కు చెందిన 80 శాతం క్రూడాయిల్ నౌకలు ఈ మార్గంలోనే పయనిస్తాయి. దీన్ని మూసేస్తే డ్రాగన్ కంట్రీకి తీవ్ర ఇబ్బందులు తప్పవు. వ్యూహాత్మక మలక్కా జలసంధి సవాళ్లను డ్రాగన్ నేతలు 2003లోనే గుర్తించారు. ఈ సమస్యను మలక్కా డైలామాగా అప్పటి అధ్యక్షుడు హు జింటావో పేర్కొన్నారు. చివరిది సింగపూర్ జలసంధి. ఇది 19 కిలోమీటర్ల పొడువున ఉంటుంది. ఇది మలక్కా జలసంధి నుంచి దక్షిణ చైనా సుమద్రానికి మధ్య లింక్‌ను కలిగి ఉంటుంది. ఈ మార్గంలో కాకుండా వేరే మార్గంలో అయితే చాలా దూరం తిరిగి రావాల్సి ఉంటుంది.
అసలు విషయం ఏమిటంటే ఈ మూడు జలసంధుల్లో దేనిపైనా చైనా నియంత్రణ లేదు. ఆ మూడు అగ్రదేశం అమెరికా నియంత్రణలో ఉన్నాయి. ఆ మూడు పాయింట్లను అమెరికాకు చెందిన ఐదో నౌకాదళం పర్యవేక్షిస్తున్నది. అరేబియన్ గల్ఫ్, ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఓమన్, హిందూ మహా సముద్రంలోని కొన్ని ప్రదేశాలతో కలిపి మొత్తం 25 లక్షల చదరపు మైళ్ల జలాలు అమెరికా ఆధీనంలో ఉన్నాయి. ఈ రీజియిన్‌లో భారీగా అమెరికా సైన్యం కూడా ఉంది. సౌదీ అరేబియాలో 10, కువైట్‌లో 10 మిలటరీ బేస్‌లు అమెరికాకు ఉన్నాయి. ఈ రీజియన్‌లో చైనాకు ఒక్క మిలిటరీ బేస్ కూడా లేదు. పీఎల్‌ఏ ఔట్ పోస్టు కేవలం జిబుటీలో మాత్రమే ఉంది. ఇక సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలన్నింటితోనూ చైనా ఘర్షణలకు దిగుతోంది. అదే సమయంలో ఈ ప్రాంత జలాలపై అమెరికా పట్టుకొనసాగిస్తోంది. ఇప్పటికీ వాషింగ్టన్ పసిఫిక్ శక్తిగా కొనసాగుతోంది. ఒకవేళ వాటిని అమెరికా నిలిపేస్తే మాత్రం చైనా ఆయిల్ దిగుమతులు నిలిచిపోనున్నాయి. దీంతో చైనాలో చమురు సంక్షోభం నెలకొనే అవకాశం ఉంది. ఇది యుద్ధానికి దిగాలనుకుంటున్న డ్రాగన్‌ను ఈ విషయమే భయపెడుతోంది.
గతంలో హర్మోజ్, మలక్కా, సింగపూర్ జలసంధులను ఎప్పుడైనా మూసేశారా? అంటే అందుకు రెండు ఉదాహరణలు ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీలను ఈ మార్గాల్లో బ్రిటన్ దిగ్బందించింది. వాటిని లొంగదీసుకునేందుకు కొత్త ఎత్తుగడ వేసింది. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ యూ-బోట్లు అట్లాంటిక్‌ను దిగ్బంధించాయి. దీంతో బ్రిటన్‌కు అమెరికా నుంచి ఆయుధాలు అందకుండా బ్రిటన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. జలసంధులను మూసేసే ఎత్తుగడ కొత్తది కాకపోయినా ప్రతిసారీ ఈ వ్యూహం మాత్రం సక్సెస్ అవుతోంది. ఇప్పుడు అమెరికా ఈ మూడు పాయింట్లను మూసేస్తే డ్రాగన్ కంట్రీకి కళ్లెం పడినట్టే వీటి నుంచి తప్పించుకునేందుకు చైనాకు అవకావశం ఉందా? అంటే అమెరికా నేవీతో ఒప్పందమే మార్గం. తాజా పరిణామాల నేపథ్యంలో ఒప్పందం సాధ్యం కాదు ఇక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్-బీఆర్‌ఐ మాత్రమే చైనాకు మిణుకుమిణుకుమంటూ కనిపిస్తున్న మార్గం. బీజింగ్ భూ మార్గంలో చైనా నుంచి పశ్చిమ ఆసియా దేశాలకు రహదారులను నిర్మించే ప్రాజెక్టు బీఆర్‌ఐని చేపట్టింది. కోవిడ్ ముందు వరకు ఈ రహదారుల పనులను అద్భుతంగా సాగాయి. ఆ తరువాత అవి అప్పుల కారణంగా నిలిచిపోయాయి.
చమురు కొరతే కాకుండా దేశంలో నెలకొన్న పరిస్థితులు కూడా యుద్దానికి వెనుకడుగు వేయడానికి కొంత కారణం ఇప్పటికే చైనాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక సంక్షోభం దిశగా అడుగులు పడుతున్నాయి. నేపథ్యంలోనే తైవాన్‌పై యుద్ధం విషయంలో డ్రాగన్ కంట్రీ సందిగ్ధంలో పడింది యుద్ధానికి దిగితే మాత్రం అమెరికా చేసే మొదటి పని ఆ మూడు జలసంధులను బ్లాక్ చేయడమే దీంతో యుద్ధంపై డ్రాగన్ మల్లగుల్లాలు పడుతోంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire