Covid Vaccin: బంప‌ర్ ఆఫ‌ర్..టీకా వేయించుకోండి రూ.840 కోట్లు గెలుచుకోండి

California to offer 116 Millon Dollard in Covid vaccine prize money
x

Covid vaccine File Photo

Highlights

Covid Vaccin: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఓ వినూత్న ఆలోచ‌న చేసింది.

Covid Vaccin: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఓ వినూత్న ఆలోచ‌న చేసింది. క‌రోనా అడ్డుక‌ట్ట వేసేందుకు అక్క‌డ ప్ర‌భుత్వం దేశ పౌరులంద‌రికి వ్యాక్సినేషన్ కార్య‌క్ర‌మం ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. అయితే, టీకా వేయించుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ఇప్పటి వరకు 63 శాతం జనాభాకు మాత్రమే టీకాలు ఇచ్చారు. మిగిలిన వారిని కూడా వ్యాక్సిన్ దిశగా ప్రోత్సహించేందుకు లక్కీ డ్రా ప్రకటించింది. నిజానికి ఇక్కడ 12 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు.

టీకా తీసుకునేందుకు యువత విముఖత ప్రదర్శిస్తుండడంతో వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించేందుకు భారీ బహుమతి ప్రకటించింది. టీకా వేయించుకోవడం ద్వారా 116 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ. 840 కోట్లు) ప్రైజ్ మనీని ప్రకటించింది. తొలి డోసు తీసుకున్న వారు ఈ లక్కీ డ్రాకు అర్హులని గవర్నర్ గవిన్ న్యూసమ్ తెలిపారు. ఇలాంటి ఆఫర్‌నే ఇప్పటికే ఒహాయో, కొలరాడో, ఒరేగాన్ రాష్ట్రాలు ప్రకటించాయి.

వచ్చే నెల 15 నుంచి కరోనా ఆంక్షలు ఎత్తివేయాలని, మునుపటి పరిస్థితి తీసుకురావాలని సంకల్పించిన ప్రభుత్వం ఇందుకోసం వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది. అయితే, యువత పెద్దగా ముందుకు రాకపోవడంతో సరికొత్త వ్యూహాన్ని రూపొందించింది. వచ్చే నెల 4 నుంచి లక్కీ డ్రా ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా 10 మందికి 1.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 10.86 కోట్లు), 30 మందికి రూ. 50 వేల డాలర్లు (రూ. 36.21 లక్షలు) ఇవ్వనున్నారు. అలాగే, 20 లక్షల మందికి 50 డాలర్లు (రూ.3,600) విలువైన గిఫ్ట్ కూపన్లు ఇవ్వనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories