Bus and Train Accident: దాయాది దేశం పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
Bus and Train Accident: దాయాది దేశం పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పంజాబ్ ప్రావిన్స్‌లోని షేఖుపురా సమీపంలో రైల్వే క్రాసింగ్ వద్ద మినీ బస్సును రైలు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో 20 మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో మొత్తం 30 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని జిల్లా పోలీసు అధికారి మహ్మద్ ఘాజీ సలావుద్దీన్ ధృవీకరించారు. అయితే చనిపోయిన వారిలో ఎక్కువగా సిక్కులు ఉండడం గమనార్హం.. ప్రస్తుతం గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వీహరయాత్రకి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
అయితే ఈ ఘటనపైన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. సిక్కు యాత్రికులు నంకానా సాహెబ్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలని ఆదుకుంటాం క్షతగాత్రులకు మెరుగైన చికిత్సను అందిస్తామని ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇక ప్రమాదానికి కారణమైన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని రైల్వే మంత్రి షేక్ రషీద్ అధికారులను ఆదేశించారు.
ఈ ఏడాది పిబ్రవరిలో కుడా పాకిస్థాన్ లో ఇలాంటి ప్రమాదమే జరిగింది. బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 51 మంది గాయపడ్డారు. కరాచీ నుంచి లాహోర్ వెళ్తోన్న సమయంలో ఈ ఘటన జరిగింది.
పాకిస్తాన్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలను సడలించింది. అందులో భాగంగానే ప్రార్థనా మందిరాలను సందర్శించేందుకు అనుమతి ఇచ్చింది. దీనితో కర్తార్‌పూర్‌లోని తమ పవిత్ర స్థలం నంకానా సాహెబ్‌ను దర్శించేందుకు సిక్కులు వెళ్ళగా అక్కడ ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత డివిజినల్ ఇంజినీర్‌ను సస్పెండ్ చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
ఇక పాకిస్థాన్ లో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి అక్కడ లాక్ డౌన్ ఎత్తేయడంతో చాలా కేసులు నమోదు అవుతున్నాయి. నిన్నటి వరకు (గురువారం) ఉన్న సమాచారం ప్రకారం ఒక్కరోజే 4,439కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిపి అక్కడ కేసుల సంఖ్య 2,17,809కి చేరింది. అక్కడ అత్యధిక కరోనా కేసులు సింధ్ ప్రావిన్స్ లోనే చోటుచేసుకుంటున్నాయి.
Deeply saddened at the accident this afternoon at a railway crossing near Sheikhupura which resulted in the death of atleast 20 people, mainly Sikh pilgrims returning from Nankana Sahib. Have directed that proper medical care be provided to the injured.
— Imran Khan (@ImranKhanPTI) July 3, 2020
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire