యెమెన్‌ దేశంలో వరుస బాంబు దాడులు

యెమెన్‌ దేశంలో వరుస బాంబు దాడులు
x
Highlights

* ఆదెన్ విమానాశ్రయంలో కారు బాంబుతో దాడి * ప్రధాని, కొత్త మంత్రులు టార్గెట్‌గా దాడి చేసిన దుండగులు * 26 మంది మృతి.. 50 మందికి పైగా గాయాలు

యెమెన్‌ దేశంలో వరుస బాంబు దాడి మారణహోమం సృష్టించింది. ఆదెన్ విమానాశ్రయంలో కొందరు దుండగులు కారు బాంబుతో దాడి చేశారు. ఆ దేశ ప్రధాన మంత్రి, నూతన మంత్రివర్గాన్ని లక్ష్యంగా ఈ దాడి జరగగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 50 మందికి పైగా గాయపడ్డారు. ప్రధాని, మంత్రులు సేఫ్‌గా బయటపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని యెమెన్ అధికారులు చెబుతున్నారు.

ప్రధాని తన పది మంది మంత్రులతో విమానం దిగగానే ఎయిర్ పోర్టులో బాంబు బ్లాస్ట్ జరిగింది. ప్రభుత్వ పెద్దలకు ఘనంగా స్వాగతం పలకడానికి అధికారులు, ప్రజలు ఎయిర్‌పోర్టులో పెద్ద ఎత్తున చేరుకోవడంతో ప్రాణ నష్టం జరిగింది. అక్కడి నుంచి జనం పారిపోయే ప్రయత్నం చేయగా ఎంట్రన్స్‌లో మరో బాంబ్ పేల్చారు దుండగులు.

Show Full Article
Print Article
Next Story
More Stories