Bangladesh Govt: అగర్తలాలో బంగ్లాదేశ్ ఆఫీస్‌పై దాడి... స్పందించిన యూనస్ ప్రభుత్వం

Bangladesh Govt: అగర్తలాలో బంగ్లాదేశ్ ఆఫీస్‌పై దాడి... స్పందించిన యూనస్ ప్రభుత్వం
x
Highlights

Bangladesh Assistant High Commission Office in Agartala: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇండియన్ హై కమిషనర్ ప్రణయ్ వర్మ అక్కడి విదేశాంగా శాఖ కార్యదర్శి ఎం...

Bangladesh Assistant High Commission Office in Agartala: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇండియన్ హై కమిషనర్ ప్రణయ్ వర్మ అక్కడి విదేశాంగా శాఖ కార్యదర్శి ఎం రియాజ్ హమిదుల్లాతో భేటీ అయ్యారు. అగర్తలాలో బంగ్లాదేశ్ అసిస్టెంట్ హై కమిషన్ ఆఫీస్‌లోపలికి సోమవారం కొంతమంది చొచ్చుకుపోయి విధ్వంసానికి పాల్పడ్డారు. కార్యాలయంలో ఉన్న బంగ్లాదేశ్ జాతియ జండాను తొలగించారు. ఈ ఘటనను బంగ్లాదేశ్ ప్రభుత్వం ఖండించింది. ఇదే విషయమై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇండియన్ హై కమిషనర్ ని పిలుపించుకుని ఆ ఘటనకు సంబంధించిన వివరాలు ఆరాతీసింది. బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు వీరి భేటీ జరిగింది.

బంగ్లాదేశ్ ఫారెన్ అఫైర్స్ సెక్రటరీతో మాట్లాడిన అనంతరం ప్రణయ్ వర్మ మీడియాతో మాట్లాడారు. అనేక అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిపారు.

మరోవైపు అగర్తలాలోని బంగ్లాదేశ్ అసిస్టెంట్ హై కమిషన్ ఆఫీస్ వద్ద భద్రతా లోపాల కారణంగా వీసా తదితర కాన్సూలేట్ సేవలు తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు బంగ్లాదేశ్ అధికారులు ప్రకటించారు. బంగ్లాదేశ్ మిషన్ ఫస్ట్ సెక్రటరీ మహ్మెద్ అల్ అమీన్ ఆ వివరాలు వెల్లడించారు.

అగర్తలాలోని బంగ్లాదేశ్ అసిస్టెంట్ హై కమిషన్ ఆఫీస్ వద్ద సోమవారం జరిగిన దాడి ఘటనను భారత్ కూడా ఖండించింది. ఈ విషయమై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ విదేశీ కాన్సూల్ ఆఫీసులపై దాడికి పాల్పడరాదని ఆందోళనకారులకు స్పష్టంచేసింది. ఇప్పటికే ఈ ఘటనలో అగర్తలా పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో పోలీసు అధికారుల నిర్లక్ష్యాన్ని గుర్తుచేస్తూ త్రిపుర ప్రభుత్వం ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories