Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం.. ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా

Sheikh Hasina was in India until the UK gave her asylum
x

Sheikh Hasina: షేక్ హసీనాకు యూకే ఆశ్రయం ఇస్తుందా? అప్పటి వరకు భారత్ లోనే హసీనా?

Highlights

Bangladesh PM Sheikh Hasina resigns: బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం.. ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా?

Bangladesh: బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అంశంపై జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో ఆ దేశంలో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. ప్రధానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన నేపథ్యంలో.. బంగ్లా ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా రిజైన్ చేశారు.

షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్ సైనిక పాలనలోకి వెళ్లింది. ప్రజలు సంయమనం పాటించాలని బంగ్లా ఆర్మీ చీఫ్ తెలిపారు. త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని.. అప్పటి వరకు తాత్కాలిక ప్రభుత్వం పాలనను పర్యవేక్షిస్తుందని వెల్లడించారు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్.

ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు, అధికారపార్టీ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనల్లో 14 మంది పోలీసులు సహా సుమారు 300 మందికి పైగా మరణించారు. గత మూడు రోజల నుంచి పరిస్థితి ఇలాగే కొనసాగుతున్న నేపథ్యంలో...ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. హసీనా రాజీనామా చేసిన వెంటనే సైనిక పాలన విధిస్తున్నట్లు బంగ్లా ఆర్మీ చీఫ్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories