క్రికెట్ మాజీ కెప్టెన్‌కు కరోనా పాజిటివ్‌

క్రికెట్ మాజీ కెప్టెన్‌కు కరోనా పాజిటివ్‌
x
Highlights

బంగ్లాదేశ్ క్రికెట్ మాజీ కెప్టెన్, పార్లమెంటు సభ్యుడు‌ మష్రాఫ్‌ మోర్తాజా(36) కు కరోనా సోకింది. ఆయన మహమ్మారి భారిన పడినట్టు మోర్తాజా కుటుంబసభ్యులు వెల్లడించారు

బంగ్లాదేశ్ క్రికెట్ మాజీ కెప్టెన్, పార్లమెంటు సభ్యుడు‌ మష్రాఫ్‌ మోర్తాజా(36) కు కరోనా సోకింది. ఆయన మహమ్మారి భారిన పడినట్టు మోర్తాజా కుటుంబసభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం మోర్తాజా‌ ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నారని తెలిపారు. "నా సోదరుడికి రెండు రోజులుగా జ్వరం వచ్చింది. అతనికి గత రాత్రి కరోనా పరీక్షలు చేశారు. ఈ రోజు కోవిడ్ పరీక్ష ఫలితం పాజిటివ్ గా వచ్చింది. దాంతో అతను ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు" అని మోర్తాజా సోదరుడు మోర్సాలిన్ క్రిక్‌బజ్‌తో అన్నారు.

కెరీర్‌లో 220 వన్డేలు, 36 టెస్టులు, 54 టి20లు ఆడిన మోర్తాజా రిటైర్మెంట్ అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం అధికార పార్టీ తరుఫున ఎంపీగా ఉన్నారు. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజలకు సహాయం చేయడానికి బయటతిరగడం వలన ఆయనకు కూడా కరోనా సోకింది. ఇటీవల కరోనా కేసులు లక్ష మార్కును దాటిన బంగ్లాదేశ్‌లో ఇప్పటివరకు 1,05,000 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఇందులో 43,000 మంది కోలుకోగా, 1,300 మంది మరణించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories