షేక్ హసీనాకు షాక్:'నవంబర్ 18 లోపు అరెస్ట్ చేయాలి'

షేక్ హసీనాకు షాక్:నవంబర్ 18 లోపుగా అరెస్ట్ చేయాలి
x

షేక్ హసీనాకు షాక్:'నవంబర్ 18 లోపుగా అరెస్ట్ చేయాలి'

Highlights

Sheikh Hasina: షేక్ హసీనా పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఐసీటీ ఆఫ్ బంగ్లాదేశ్ ఈ వారెంట్ ఇచ్చింది.

Sheikh Hasina: షేక్ హసీనా పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఐసీటీ ఆఫ్ బంగ్లాదేశ్ ఈ వారెంట్ ఇచ్చింది. 2024, నవంబర్ 18 లోపుగా ఆమెను అరెస్ట్ చేసి తమ ఎదుట హాజరుపర్చాలని ఐసీటీ ఆఫ్ బంగ్లాదేశ్ ఆదేశించింది. హసీనాతో పాటు మరో 45 మందిపై కూడా ఈ వారెంట్ జారీ అయింది. వీరంతా హసీనా పార్టీకి చెందిన అవామీ లీగ్ నాయకులు.

రిజర్వేషన్లపై విద్యార్ధుల నిరసనలు హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా పదవి నుంచి వైదొలిగారు. బంగ్లాదేశ్ నుంచి ఆమె నేరుగా దిల్లీకి వచ్చారు. జులై 15 నుంచి ఆగస్టు 5 వరకు జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి హసీనాకు వ్యతిరేకంగా ఐసీటీకి ఫిర్యాదులు అందాయి. వాటిపై ట్రైబ్యునల్ దర్యాప్తు ప్రారంభించింది. హసీనాను బంగ్లాదేశ్ కు రప్పించాలని ప్రాసిక్యూషన్ ట్రైబ్యునల్ లో రెండు పిటిషన్లు దాఖలు చేసింది. దీంతో ట్రైబ్యునల్ ఛైర్మన్ జస్టిస్ మహమ్మద్ గోలం మోర్తుజా మజుందార్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారని చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ తాజులు ఇస్లాం చెప్పారు.

వీరిపై అరెస్టు వారెంట్లు జారీ చేయాలని కోరుతూ ప్రాసిక్యూషన్ ట్రిబ్యునల్ లో రెండు పిటిషన్లు దాఖలు చేయడంతో ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ మహ్మద్ గోలం మోర్తుజా మజుందార్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ ఈ ఆదేశాలు జారీ చేసిందని చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ తాజుల్ ఇస్లాం తెలిపారు.

బంగ్లాదేశ్, భారత్ మధ్య ఒప్పందం ఏంటి?

బంగ్లాదేశ్, భారత్ మధ్య 1962, 2013, 2016 మధ్య ఒప్పందాలు జరిగాయి. నేరస్తుల అప్పగింతపై ఒప్పందాలున్నాయి. 2013లో నేరస్తుల అప్పగింత ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇదే ఒప్పందాన్ని 2016 లో సవరించారు. బంగ్లాదేశ్ లో తలదాచుకొని ఇండియాలో వేర్పాటువాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిని భారత్ కు రప్పించేందుకు ఇది దోహదపడింది. బంగ్లాదేశ్ కూడా జమాత్ ఉల్ ముజాహిదీన్ అంటే జేఎంబీ వంటి సంస్థలతో ఇబ్బందులు పడింది. బెంగాల్ ,అసోం వంటి రాష్ట్రాల్లోని జేఎంబీ శ్రేణులు దాక్కున్నారని గుర్తించారు. 2015లో అగ్రశ్రేణి ఉల్ఫా నాయకులు అనుప్ చెటియాను బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు రప్పించేందుకు ఈ ఒప్పందం కారణమైంది.

రాజకీయ స్వభావం ఉంటే మినహాయింపుంటుందా?

ఈ ఒప్పందం మేరకు భారత్, బంగ్లాదేశ్ లు ఆయా దేశానికి చెందిన న్యాయస్థానం ద్వారా అభియోగాలు మోపబడిన లేదా దోషులుగా గుర్తించిన లేదా కోరబడిన వ్యక్తులను అప్పగించాల్సి ఉంటుంది. కనీసం ఏడాది పాటు జైలు శిక్ష విధించే నేరం ఉండాలని ఒప్పందాలు చెబుతున్నాయి.ఇందులో ఆర్ధిక నేరాలు కూడా ఉన్నాయి. అయితే రెండు దేశాల్లో ఈ నేరం చేస్తే శిక్ష ఉండాలి. ఇలా ఉంటేనే నేరస్తులను అప్పగిస్తారు.

రాజకీయ స్వభావం ఉన్న నేరాలకు సంబంధించి అప్పగింతను తిరస్కరించవచ్చని ఈ ఒప్పందం చెబుతోంది. హసీనాపై పలు కేసులు నమోదయ్యాయి. ఆగస్టు 13న పోలీసు కాల్పుల్లో మరణించిన దుకాణ యజమాని హత్యకు హసీనా కారణమని కేసు నమోదైంది. ఆగస్టు 14న ఆమెపై కిడ్నాప్ కేసు నమోదైంది. ఆగస్టు 15న హత్య, చిత్రహింసలు, మారణహోమం వంటి అభియోగాలు మోపారు. 1962లో రెండుదేశాల మధ్య జరిగిన నేరస్తుల ఒప్పందంలోని ఆర్ఠికల్ 8 (1) (a)ప్రకారంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై రాజకీయదురుద్దేశ్యాలతో ఆరోపణలు చేస్తే వారిని ఆ దేశాలకు అప్పగించేందుకు తిరస్కరించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories