బేబీ హిప్పో ఎంత క్యూట్‌గా ఉందో... వైరల్‌గా మారిన వీడియో

baby hippo attracts huge crowds to zoo in thailand viral video
x

Viral Video: ఇంటర్నెట్‎ను షేక్ చేస్తోన్న హిప్పో ..ఈ బుజ్జి హిప్పోటొమస్‎ను చూసేందుకు క్యూకట్టిన జనం

Highlights

Baby Hippo: ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో ఎవరికీ అర్థం కాదు. అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ, కాదేది కవితకు అనర్హం అన్నట్టు. ఏ వీడియో వైరల్ అవుతుందో ఎవరికీ తెలియదు. ఏ విషయం ఎవరిని ఆకట్టుకుంటుందో.. ఎందుకు ఆకట్టుకుంటుందో కూడా వివరణ ఇవ్వలేము.

Baby Hippo: ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో ఎవరికీ అర్థం కాదు. అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ, కాదేది కవితకు అనర్హం అన్నట్టు. ఏ వీడియో వైరల్ అవుతుందో ఎవరికీ తెలియదు. ఏ విషయం ఎవరిని ఆకట్టుకుంటుందో.. ఎందుకు ఆకట్టుకుంటుందో కూడా వివరణ ఇవ్వలేము.

తాజాగా థాయిలాండ్ లోని ఓ జూ పార్కులో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. ముద్దుగా బొద్దుగా ఉండే ఓ పిల్ల హిప్పోపొటమస్ ను చూసేందుకు జనం ఎగబడి వస్తున్నారు. అంతేకాదు ఈ పిల్ల హిప్పోపొటమస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతుంది. అయితే ఇదే అదనుగా దాని క్రేజ్ క్యాష్ చేసుకునేందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు జూ పార్కు పోటెత్తి వస్తున్నారు.

తమ వీడియోల్లో ఈ బేబీ హిప్పుపొటమస్ చూపిస్తూ ఈ వీడియోలపై డబ్బు సంపాదించుకుంటున్నారు. జూన్ నెలలో జన్మించిన ఈ బేబీ హిప్పో కారణంగా జూకు వచ్చే సందర్శకుల సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. అయితే సందర్శకులు ఆ హిప్పోను ఇబ్బంది పెడుతున్నట్లు గమనించారు జూ సిబ్బంది. దీంతో సందర్శకులను కంట్రోల్ చేసేందుకు జూ సిబ్బంది రంగంలోకి దిగింది.

ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత అరుదైన జాతిగా పేరు సంపాదించుకున్న ఈ పిగ్మీ హిప్పోలను పశ్చిమ ఆఫ్రికాలో ఉంటాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) ప్రకారం ఈ జాతి హిప్పోలు భూమిపై 3,000 కంటే తక్కువ మిగిలి ఉన్నాయని లెక్కల్లో తేలింది. ఇలాంటి అరుదైన జాతికి చెందిన జంతువును ఇబ్బంది పెట్టడం తగదని జూ డైరెక్టర్ నరోంగ్విట్ చోడ్చోయ్ పేర్కొన్నారు.

అంతేకాదు ఈ పిల్ల హిప్పో ఉంటున్న ఎన్క్లోజర్ చుట్టూ సీసీ కెమెరాలు సైతం అమర్చారు. ఇదిలా ఉంటే థాయిలాండ్ లో పలు సౌందర్య ఉత్పత్తులు సైతం ఈ పిల్ల హిప్పో పేరిట విడుదల చేస్తున్నారు అంటే దీని క్రేజీ ఏ రేంజ్ లో పాకిందో అర్థం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జూ ప్రస్తుతం ఈ హిప్పో కారణంగా తెగ ఫేమస్ అయిపోయింది. ఈ పిల్ల హిప్పో తో సెల్ఫీలు దిగేందుకు వేలాది మంది ప్రజలు ఈ జూకు తరలి వస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories