Azerbaijani airliner plane crash: రష్యా గగనతలంలో ఆంక్షలే విమాన ప్రమాదానికి దారితీశాయా?

Azerbaijani airliner plane crash: రష్యా గగనతలంలో ఆంక్షలే విమాన ప్రమాదానికి దారితీశాయా?
x
Highlights

Azerbaijani airliner plane crash: కజకిస్తాన్‌లో అజర్‌బైజాన్ ఎయిర్ లైన్స్ విమానం కూలిపోవడానికి ఆ విమానాన్ని పక్షి ఢీకొనడమే కారణం అని ప్రాథమిక...

Azerbaijani airliner plane crash: కజకిస్తాన్‌లో అజర్‌బైజాన్ ఎయిర్ లైన్స్ విమానం కూలిపోవడానికి ఆ విమానాన్ని పక్షి ఢీకొనడమే కారణం అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కారణంగానే విమానం ఆక్టావ్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యేందుకు ప్రయత్నించిందని రష్యా పౌర విమానయాన సంస్థ వెల్లడించింది. అజర్ బైజాన్ లోని బాకు నుండి రష్యాలోని గ్రోజ్నీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం కూలిపోయిన సమయంలో అందులో 62 మంది ప్రయాణికులు, మరో ఐదుగురు సిబ్బంది ఉన్నారు. ఈ 67 మందిలో కేవలం 32 మందే బతికి బయటపడినట్లు వార్తలొస్తున్నాయి.

ఆక్టావ్ మరో 3 కిమీ ఉందన్నప్పటి నుండే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అనుమతి కోరినట్లు అజర్ బైజన్ ఎయిర్ లైన్స్ అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోరినప్పటికీ విమానం క్యాస్పియన్ సముద్రం ఎందుకు దాటిందని మీడియా ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు అక్కడి అధికారుల నుండి సరైన సమాధానం రాలేదు.

రష్యా గగనతలంపై ఆంక్షలే ప్రమాదానికి కారణమా?

అజర్‌బైజాన్ ఎయిర్ లైన్స్ విమానం కూలిపోవడానికి పక్షి ఢీకొనడం కారణం అని ప్రాథమిక దర్యాప్తు చెబుతున్నప్పటికీ... అసలు విమానం డైవర్ట్ కావడానికి రష్యా గగనతలంలో ఆంక్షలు విధించడమే కారణమా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే దక్షిణ రష్యాలో ప్రస్తుతం డ్రోన్ ఎటాక్స్ జరుగుతున్నాయి (Drone Attacks on Russia).

బుధవారం కూడా దక్షిణ రష్యాలో ఒక డ్రోన్ తన లక్ష్యాన్ని ఢీకొన్నకొద్దిసేపటికే ఈ విమాన ప్రమాదం జరిగిందని రాయిటర్స్ వెల్లడించింది. దీంతో డ్రోన్ దాడుల కారణంగా రష్యాలో విమానాశ్రయం మూసేసి ఉండటం వల్లే అజర్‌బైజాన్ ఎయిర్ లైన్స్ విమానం ఎమర్జెన్సీగా డైవర్ట్ చేయడానికి కారణమై ఉండొచ్చా అనే అనుమానాలకు తావిచ్చింది. లేదంటే విమానం సాఫీగా తన గమ్యస్థానం దశగా ముందుకు సాగిపోయి ఉండేదనేది ఆ అనుమానాల వెనుకున్న వాదన.

కజకిస్తాన్‌లో జరిగిన ఈ విమాన ప్రమాదంపై ఆ దేశ ప్రభుత్వం కూడా ఆరాతీస్తోంది. ప్రస్తుతం విమాన ప్రమాదం జరిగిన స్థలంలో తక్షణమే చర్యలు చేపట్టి క్షతగాత్రులకు అవసరమైన సహాయం అందించేలా చూడాల్సిందిగా ఆ దేశ నాయకత్వం అక్కడి స్థానిక అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది (Azerbaijani airliner plane crashed in Kazakhstan).

Show Full Article
Print Article
Next Story
More Stories