Australia - Covishield: కొవిషీల్డ్ టీకాకు ఆస్ట్రేలియా ఆమోదం

Australia Approved Covishield Corona Vaccine Which is Made by AstraZeneca Serum Institute of India | Coronavirus
x

కొవిషీల్డ్ టీకాకు ఆస్ట్రేలియా ఆమోదం

Highlights

Australia - Covishield: కొవిషీల్డ్ టీకా తీసుకున్న ఇండియన్స్‌ ఆస్ట్రేలియాకు అనుమతి...

Australia - Covishield: కొవిషీల్డ్ టీకాకు ఆస్ట్రేలియా ఆమోదం తెలిపింది. భారత్‌కు చెందిన సీరం సంస్థ.. కొవిషీల్డ్ కొవిడ్ టీకాలను తయారు చేస్తోంది. ఇక నుంచి కొవిషీల్డ్ టీకా తీసుకున్న భారతీయులు ఆస్ట్రేలియాలో పర్యటించవచ్చు. ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయం వేలాది మంది ఇండియన్‌లకు ఊరటనిచ్చింది. కొవిషీల్డ్‌తో పాటు చైనాకు చెందిన సైనోవాక్ టీకాలు ఇస్తున్న రక్షణ పట్ల ఆస్ట్రేలియా ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు.

మరోవైపు అంతర్జాతీయ ప్రయాణికులపై ఉన్న ఆంక్షలను కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎత్తివేయనుంది. నవంబర్ నుంచి విదేశీ ప్రయాణికులు రావొచ్చంటూ ఆస్ట్రేలియా ప్రకటించింది. అంతర్జాతీయ ప్రయాణికులపై గత 18 నెలలుగా ఉన్న నిషేధాన్ని ఆస్ర్టేలియా ఎత్తివేసింది. సైనోవాక్, కొవిషీల్డ్ టీకాలు వేసుకున్న ప్రయాణికులకు ఆటంకాలు ఉండవని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories