కిర్గిజిస్తాన్ లో భారత్, పాక్ విద్యార్థులపై దాడులు

Attacks On India And Pakistan Students In Kyrgyzstan
x

కిర్గిజిస్తాన్ లో భారత్, పాక్ విద్యార్థులపై దాడులు

Highlights

కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్ లో గత రెండు రోజులుగా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్ లో గత రెండు రోజులుగా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దుండగులు భారత్ , బంగ్లాదేశ్, పాకిస్తాన్ చెందిన విద్యార్ధులుంటున్న హస్టళ్లను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నాయి.ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఈ దాడుల్లో ముగ్గురు పాకిస్తాన్ విద్యార్థులు మృతి చెందారని నివేదికలు తెలుపుతున్నాయి. కిర్గిజిస్తాన్ లో ఉంటున్న విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని పాకిస్తాన్, ఇండియాలు సూచించాయి.

స్థానికులు, విదేశీ విద్యార్థుల మధ్య హాస్టల్ లో జరిగిన ఘర్షణ తర్వాత హింస చెలరేగినట్టుగా స్థానిక మీడియా రిపోర్టు చేసింది.ఈ నెల 13న విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టైమ్స్ ఆఫ్ సెంట్రల్ ఏషియా నివేదిక ప్రకారంగా ఘర్షణకు పాల్పడ్డారనే అనుమానంతో ముగ్గురు విదేశీ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘర్షణ విషయం తెలిసిన వెంటనే స్థానికులు వీధుల్లోకి వచ్చారు. పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్ విద్యార్థులుంటున్న హస్టళ్లు, నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని దాడికి దిగారు.విద్యార్ధినులపై వేధింపులకు దిగినట్టుగా పాకిస్తాన్ ఆజ్ న్యూస్ రిపోర్టు చేసింది. కొందరు విద్యార్థులు గాయపడినట్టుగా ఆ కథనం తెలిపింది.

బిష్కెక్ లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం మాత్రం మరణాల గురించి ఎలాంటి నివేదికలు రాలేదని ప్రకటించింది. సాధారణ పరిస్థితులు చేరుకొనే వరకు విద్యార్థులు తమ ఇళ్లలోనే ఉండాలని సూచించింది.

రాజధానిలోని వైద్య విశ్వవిద్యాలయాల హాస్టళ్లు, పాకిస్తాన్ సహా ఇతర విదేశీ విద్యార్థుల నివాసాలపై దాడులు జరిగినట్టుగా బిష్కెక్ లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం తెలిపింది.పలువురు విద్యార్థులు గాయపడినట్టుగా ప్రకటించింది.

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కిర్గిజిస్తాన్ లో ఘటనలపై స్పందించారు. ఇండియన్ ఎంబసీతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. విద్యార్థులు ఇళ్లు విడిచి రావొద్దని ఇండియన్ కాన్సులేట్ సోషల్ మీడియా వేదికగా కోరింది.


స్థానిక, ఈజిప్ట్ విద్యార్థుల మధ్య ఘర్షణ తర్వాత అల్లరిమూకలు విదేశీ విద్యార్థులను లక్ష్యంగా దాడులు నిర్వహిస్తున్నారని ఓ వీడియోలో విద్యార్థులు తెలిపారు.సోషల్ మీడియాలో ఈ వీడియో చక్కర్లు కొడుతుంది.ఆరుగురు విద్యార్థులు మృతి చెందారని.. వారు ఏ దేశానికి చెందినవారో తెలియదని ఆ వీడియోలో పేర్కొన్నారు.ప్రస్తుతం పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయని, ఆందోళనకారులతో చర్చలు జరుపుతున్నట్టుగా కిర్గిజిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది.

కిర్గిజిస్తాన్ కు విద్యార్థులు ఎందుకు వెళ్తారు?

దక్షిణాసియా దేశాల విద్యార్థులకు అత్యుత్తమ వైద్య విద్య అందించే దేశంగా కిర్గిజిస్తాన్ ఉంది.2021లో 61,418 మంది విదేశీ విద్యార్థులు విద్యనభ్యసించినట్టుగా మైగ్రేషన్ డేటా పోర్టల్ నివేదిక తెలుపుతుంది. ఇందులో 14,500 భారతీయులు, 10 వేల మంది పాకిస్తాన్ విద్యార్థులున్నారు.

మధ్య ఆసియా దేశాలలో ఆరోగ్య సంరక్షణ, విద్య, రవాణా సౌకర్యం కిర్గిజిస్తాన్ లో ఉంది. అతి తక్కువ జీవన వ్యయం, భారతీయ వంటకాలు కూడ ఇక్కడ లభిస్తాయి. వైద్య విద్యలో చేరడానికి ఎలాంటి ప్రవేశ రుసుం లేదు. ఇక్కడ అందించే వైద్య విద్య సర్టిఫికెట్లను అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. ఆరేళ్ల ఎంబీబీఎస్ కోర్సుకు ట్యూషన్ ఫీజు, క్లినికల్ ట్రైనింగ్ తో కలిపి రూ. 22 లక్షలు మాత్రమే.

అదే భారత్ లో అయితే ఎంబీబీఎస్ కోర్సుకు ప్రతి ఏటా రూ. 25 లక్షలు చెల్లించాల్సిన పరిస్థితులున్నాయి.కోర్సు పూర్తి చేయడానికి కనీసం కోటి రూపాయాలు ఖర్చు చేయాల్సి వస్తుంది. డీమ్డ్ యూనివర్శిటీల్లో ఏడాదికి 21 లక్షల రూపాయాలు ఖర్చు చేయాలి.ఎంబీబీఎస్ పూర్తి కావడానికి కనీసం 90 లక్షల రూపాయాలు వెచ్చించాల్సి వస్తుంది. అందుకే కిర్గిజిస్తాన్ కు వెళ్తుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories