Covid Vaccine: ఆస్ట్రాజెనెకా కీలక నిర్ణయం.. మార్కెట్​ నుంచి కొవిడ్ 'వ్యాక్సిన్' ఉపసంహరణ

AstraZeneca Withdraws Covid Vaccine Globally
x

Covid Vaccine: ఆస్ట్రాజెనెకా కీలక నిర్ణయం.. మార్కెట్​ నుంచి కొవిడ్ 'వ్యాక్సిన్' ఉపసంహరణ

Highlights

AstraZeneca: కొవిడ్‌ వ్యాక్సిన్లను మార్కెట్‌ నుంచి వెనక్కు తీసుకుంటున్నట్టు ఆస్ట్రాజెనెకా ప్రకటించింది.

AstraZeneca: కొవిడ్‌ వ్యాక్సిన్లను మార్కెట్‌ నుంచి వెనక్కు తీసుకుంటున్నట్టు ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. మార్కెట్‌లో అప్‌డేటెడ్‌ టీకాలు పెద్ద సంఖ్యలో అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తమ వ్యాక్సిన్‌ వ్యాక్స్‌జెవ్రియాకు గిరాకీ తగ్గిందని పేర్కొంది. ఇప్పటికే దీని తయారీ, పంపిణీని నిలిపివేసినట్లు వెల్లడించింది. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంతో కలిసి ఆస్ట్రాజెనెకా కొవిడ్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ టీకాపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతోంది. కోర్టులో విచారణ జరుగుతుండగానే ఆస్ట్రాజెనెకా ఈ నిర్ణయం తీసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories