అబార్షన్లను చట్టబద్ధం చేస్తూ అర్జెంటీనా చరిత్రాత్మక నిర్ణయం

అబార్షన్లను చట్టబద్ధం చేస్తూ అర్జెంటీనా చరిత్రాత్మక నిర్ణయం
x
Highlights

అబార్షన్లను చట్టబద్ధం చేస్తూ అర్జెంటీనా చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. లాటిన్‌ అమెరికన్‌ దేశాల్లో ఇలాంటి నిర్ణయం తీసుకున్న ప్రధాన దేశం అర్జెంటీనా....

అబార్షన్లను చట్టబద్ధం చేస్తూ అర్జెంటీనా చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. లాటిన్‌ అమెరికన్‌ దేశాల్లో ఇలాంటి నిర్ణయం తీసుకున్న ప్రధాన దేశం అర్జెంటీనా. అబార్షన్లను అనుమతించొద్దని... అది శిశువుల జీవించే హక్కును హరించడమేనంటూ... కేథలిక్ చర్చి వ్యతిరేకతను కాదని అర్జెంటీనా సెనేట్‌ 38–29 ఓట్ల తేడాతో చట్టాన్ని ఆమోదించింది. బ్యూనస్‌ ఏర్స్‌లో ఉన్న సెనేట్‌ భవనం ముందు నిరీక్షిస్తున్న వేలాది మంది ప్రజలు హర్షద్వానాలతో కొత్త చట్టానికి మద్దతు పలికారు. చట్టాన్ని వ్యతిరేకించిన వారు, బిల్లు ఆమోదం పట్ల కన్నీళ్లు కార్చిన వారు కూడా లేకపోలేదు. 14వారాల గర్భం వరకు మహిళలకు అబార్షన్లను అనుమతిస్తూ ఈ చట్టం తీసుకొచ్చారు. 2018లోనే ఈ చట్టం తీసుకొచ్చేందుకు విఫలయత్నం జరిగింది. అప్పుడు ప్రవేశపెట్టిన బిల్లును దిగువసభ ఆమోదించినప్పటికీ స్వల్ప ఓట్ల తేడాతో సెనేట్‌లో వీగిపోయింది. ఇప్పుడు పాలకపక్షం అనుమతితో బిల్లు ఆమోదం పొందింది.



Show Full Article
Print Article
Next Story
More Stories