Amit Shah: కెనడాలో సిక్కులపై దాడుల వెనుక ఉన్నది భారత హోం మంత్రేనని ఆరోపించిన మినిస్టర్ మోరిసన్

Amit Shah, David Morrison
x

Amit Shah, David Morrison

Highlights

Amit Shah: కెనడాలో సిక్కు వేర్పాటువాదులను టార్గెట్ చేస్తూ, వారికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించిన వ్యక్తి మరెవరో కాదు భారత హోం మంత్రి అమిత్ షానే అని కెనడా డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ డేవిడ్ మోరిసన్ మంగళవారం నాడు ఆరోపించారు.

Amit Shah: కెనడాలో సిక్కు వేర్పాటువాదులను టార్గెట్ చేస్తూ, వారికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించిన వ్యక్తి మరెవరో కాదు భారత హోం మంత్రి అమిత్ షానే అని కెనడా డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ డేవిడ్ మోరిసన్ మంగళవారం నాడు ఆరోపించారు. కెనడాలో హింసాత్మక కార్యకలాపాల వెనుక ఉన్నది అమిత్ షా అని తాను వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు ధ్రువీకరిస్తూ చెప్పానని ఆయన కెనడా నేషనల్ సెక్యూరిటీ కమిటీకి చెందిన పార్లమెంటు సభ్యులకు చెప్పారు.

ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో ‘ప్రమేయం ఉన్న వ్యక్తులు’గా ఆరుగురు భారత దౌత్యవేత్తల పేర్లను కెనడా వెల్లడించడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు ఎన్నడూ లేనంతగా దెబ్బతిన్నాయి, ఈ వ్యవహారంలో అమిత్ షా జోక్యం ఉందని భావిస్తున్నారా అని వాషింగ్టన్ పోస్ట్ విలేఖరి నిర్దిష్టంగా అడిగిన ప్రశ్నకు తాను అవునని చెప్పానని మోరిసన్ అన్నారు.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కుడి భుజంగా భావించే అమిత్ షాపై కెనడా ప్రభుత్వం అధికారికంగా చేసిన ఈ తీవ్రమైన ఆరోపణలపై భారత ప్రభుత్వం వెంటనే స్పందించలేదు. నిజ్జర్ హత్య తరువాత రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

2023 సెప్టెంబర్‌లో జరిగిన నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం తోసిపుచ్చింది. అవన్నీ రాజకీయ దురుద్దేశంతో కూడుకున్న ఆరోపణలని విమర్శించింది.

‘కెనడాలో ఎన్నికల్లో, క్రిమినల్ కార్యకలాపాల్లో భారత ప్రభుత్వ ఏజెంట్ల జోక్యం’పై విచారిస్తున్న కెనడియన్ హౌస్ ఆఫ్ కామన్స్ కమిటీ ముందు మోరిసన్ హాజరయ్యారు. అమిత్ షా జోక్యం గురించిన సమాచారాన్ని కెనడా ప్రజలతో కాకుండా వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు ఎందుకు చెప్పారని ఒక లెజిస్లేటర్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. “ఆ పత్రిక విలేఖరి కాల్ చేసి ఈ విషయం గురించి మాట్లాడారు. ఆ వ్యవహారంలో జోక్యం చేసుకున్న వ్యక్తి అమిత్ షానేనా అని అడిగారు. అవును ఆయనే అని నేను ధ్రువీకరించాను” అని మోరిసన్ చెప్పారు. అయితే, నిజ్జర్ కేసుతో అమిత్ షాకు సంబంధం ఉందనడానికి ఎలాంటి వివరాలు ఆయన చెప్పలేదు.

హౌస్ ఆఫ్ కామన్స్ కమిటీ విచారణకు సంబంధించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై సాగరికా ఘోష్ వంటి జర్నలిస్టులు, ఇది ఆందోళనకర పరిణామం అంటూ వ్యాఖ్యానించారు. అయితే, భారత ప్రభుత్వం దీనిపై అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories