అమెరికా సుప్రీంకోర్టు జడ్జి రూత్‌ ఇకలేరు

అమెరికా సుప్రీంకోర్టు జడ్జి రూత్‌ ఇకలేరు
x
Highlights

పాన్‌క్రియాటిక్ క్యాన్సర్ సమస్యల కారణంగా అమెరికా సుప్రీంకోర్టు జస్టిస్ రూత్‌ బాడర్‌ గిన్స్‌బర్గ్ శుక్రవారం మరణించినట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది...

పాన్‌క్రియాటిక్ క్యాన్సర్ సమస్యల కారణంగా అమెరికా సుప్రీంకోర్టు జస్టిస్ రూత్‌ బాడర్‌ గిన్స్‌బర్గ్ శుక్రవారం మరణించినట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆమె వయసు 87 సంవత్సరాలు. 1993లో అప్పటి అధ్యక్షుడు, డెమొక్రాటిక్‌ నాయకుడు బిల్‌ క్లింటన్‌ ఆమెను సుప్రీం జడ్జిగా నియమించారు. అమెరికా సుప్రీంకోర్టు జడ్జి అయిన రెండో మహిళగా ఆమె రెకార్డులలోకి ఎక్కారు. అప్పట్నుంచి 27 ఏళ్ల పాటు ఆమె సమ న్యాయం కోసమే పాటుపడ్డారు. గర్భస్రావం హక్కులు, స్వలింగ వివాహం, ఓటింగ్ హక్కులతో సహా ఆనాటి అత్యంత విభజించబడిన సామాజిక సమస్యలపై ఆమె గతంలో పోరాటం చేశారు. రూత్‌ మరణంతో ఆమె అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంది. శుక్రవారం రాత్రి సుప్రీంకోర్టు దగ్గరకి వేలాదిగా జనం తరలి వచ్చి కొవ్వొత్తులు ప్రదర్శిస్తూ రూత్ కు అశ్రు నివాళులర్పించారు.

కాగా అమెరికాలో ఒకసారి న్యాయమూర్తి నియామకం జరిగితే వారు జీవితాంతం ఆ పదవిలో కొనసాగుతారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికలు తరువాత తన స్థానాన్ని భర్తీ చేయాలనీ ఇది తన చివరి కోరిక అంటూ ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఆమె చివరి కోరిక తీర్చాలంటూ డెమొక్రాట్‌ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ కూడా‌ డిమాండ్‌ చేశారు. ఈ తరుణంలో ఆమె అధ్యక్ష ఎన్నికలకు ముందే మరణించారు. ఆమె మృతిపట్ల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నివాళులు అర్పించారు. మిన్నెసోటాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ట్రంప్‌ రూత్‌ని ఒక ఆదర్శమైన, అద్భుత వ్యక్తిగా అభివర్ణించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories