Afghanistan: స్వదేశానికి వెళ్లాలంటే భయంతో వణికిపోతున్న ఆప్ఘాన్ పైలట్లు

Afghan Pilots Whos Training in Uzbekistan are Fear to go back Afghanistan | Afghanistan Taliban News
x

స్వదేశానికి వెళ్లాలంటే భయంతో వణికిపోతున్న ఆప్ఘాన్ పైలట్లు

Highlights

Afghanistan: అమెరికా సాయంతో ఉజ్బెకిస్తాన్‌లో శిక్షణ తీసుకున్న పైలట్ల పరిస్థితి దారుణం

Afghanistan: ఆప్ఘనిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో విదేశాల్లో ఉన్న ఆప్ఘన్లు స్వదేశానికి వెళ్లాలంటే వణికిపోతున్నారు. పౌరులు సహా, అమెరికా సాయంతో ఉజ్బెకిస్తాన్‌లో శిక్షణ తీసుకున్న ఆప్ఘాన్ పైలట్లు తమను తిరిగి స్వదేశానికి పంపుతారేమోనని భయపడిపోతున్నారు. ఎక్కువకాలం తమ దేశంలో ఉండడం కుదురదంటూ ఉజ్బెకిస్తాన్ స్పష్టం చేయడంతో వారికి ప్రాణభయం పట్టుకుంది. ఉజ్బెకిస్తాన్ నుంచి తమను వెనక్కి పంపితే తమను కచ్చితంగా చంపేస్తారని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. తమను కొంతకాలం ఇక్కడే ఉంచాలన్న పైలట్ల విజ్ఞప్తిపై ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వం స్పందించలేదు.

మరోవైపు.. ఆప్ఘనిస్తాన్‌లో ప్రజాస్వామ్యం ఇక ఉండబోదని తాలిబన్లు వెల్లడించారు. దేశాన్ని ఓ కౌన్సిల్ ద్వారా పరిపాలించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే తాలిబన్లు ఆప్ఘన్ పైలట్లు, సైనికులను కూడా సంప్రదించి వారిని విధుల్లో చేరాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ప్రభుత్వ, తాలిబన్ బలగాలను కలిపే ఓ సైన్యం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. అయితే.. తమను తాలిబన్లు లక్ష్యంగా చేసకున్నారని, అక్కడకు వెళ్తే తమను చంపేస్తారని ఆప్ఘన్ పైలట్లు ఆందోళనకు గురి అవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories