Israel: ఇరాన్‌ ఎంబసీపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి.. ఏడుగురు మృతి

7 Killed As Israel Strikes Iran Embassy In Syria
x

Israel: ఇరాన్‌ ఎంబసీపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి.. ఏడుగురు మృతి

Highlights

Israel: సీనియర్‌ అధికారులు మృతిచెందినట్లు వెల్లడి

Israel: సిరియా రాజధానిలోని ఇరాన్‌ రాయబార కార్యాలయ భవనంపై ఇజ్రాయెల్‌ సోమవారం దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఇరాన్‌ ఎంబసీ అనెక్స్‌లో సీనియర్‌ ఇరానియన్‌ కమాండర్‌ సహా ఏడుగురు‎ మృతిచెందినట్టు వార్‌ మానిటర్‌ నివేదిక వెల్లడించినట్టు స్థానిక మీడియా తెలిపింది. డమాస్కస్‌ ఏరియా మజ్జే పరిసరాల్లోని ఇరాన్‌ కాన్సులేట్‌ భవనాన్ని ఇజ్రాయెల్‌ టార్గెట్‌గా చేసుకున్నట్టు సిరియా అధికారిక వార్తా సంస్థ సనా తెలిపింది. బాంబు దాడి జరిగిన ప్రదేశాన్ని వార్తా ఏజెన్సీలు ధృవీకరించాయి. దాడిలో రాయబార కార్యాలయం పక్కన ఉన్న అనుబంధ భవనం నేలమట్టమైంది. ఈ దాడుల్లో ఇరాన్‌ కమాండర్‌ మహ్మద్‌ రెజా జాహెదీ మరణించినట్టు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్‌ వెల్లడించింది. అయితే ఈ లేటెస్ట్ అటాక్‌పై ఇరాన్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

దాడి ఘటనలో కుప్పకూలిన కాన్సులర్‌ భవనం పక్కనే రాయబార కార్యాలయం ఉంది. ఈ దాడిలో చనిపోయిన ఇరాన్‌ జనరల్‌ అలీ రెజా జెహ్‌దీ 2016 వరకు లెబనాన్‌, సిరియా దేశాల్లో ఖుద్స్‌ బలగాలకు నేతృత్వం వహించారని సమాచారం. గత అక్టోబర్‌ 7న జరిగిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ ఈ దాడిచేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దాడి జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ దాడిపై ఇజ్రాయెల్‌ ఇంకా స్పందించలేదు. ఈ ఘటనను సిరియాలో ఇరాన్‌ రాయబారి హొస్సేన్‌ అక్బరీ ఖండించారు. దాడిలో ఏడుగురు చనిపోయినట్లు ఆయన తెలిపారు. ఇజ్రాయెల్‌ ప్రతిదాడి ఎదుర్కోక తప్పదని ఇంతే స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories