350 Elephants Drop Dead in Botswana: అంతుచిక్కని కారణాలతో 350 ఏనుగులు మృతి

350 Elephants Drop Dead in Botswana: అంతుచిక్కని కారణాలతో 350 ఏనుగులు మృతి
x
elephants deaths in botswana
Highlights

350 Elephants Drop Dead in Botswana: ఆఫ్రికా దేశమైన బోట్స్వానాలో గత రెండు నెలల్లో 350 కి పైగా ఏనుగులు అంతుచిక్కని కారణాలతో చనిపోయాయి.

350 Elephants Drop Dead in Botswana: ఆఫ్రికా దేశమైన బోట్స్వానాలో గత రెండు నెలల్లో 350 కి పైగా ఏనుగులు అంతుచిక్కని కారణాలతో చనిపోయాయి. దేశంలోని ఉత్తర భాగంలో ఉన్న ఒకావాంగో డెల్టాలో ఎక్కువగా ఏనుగులు చనిపోతున్నాయి. అక్కడి అటవీ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఏనుగు కళేబరాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఏనుగుల మృతదేహాలు ఉపగ్రహం నుండి తీసిన ఛాయా చిత్రాల ద్వారా బయటకు వచ్చాయి, ఇవి ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఆ చిత్రాలు చూస్తుంటే 2 నెలల క్రితం

మరణించి ఉంటాయని పశువైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే అవి ఎలా మరణించాయనేది మాత్రం కనిపెట్టలేదు.

'మే' నెలలో వందలాది ఏనుగులు మరణించినట్టుగా అటవీ అధికారులకు సమాచారం అందింది. ఆ తరువాత నిరంతర ఏనుగుల మృతదేహాలు కనిపిస్తూనే ఉన్నాయి. జూన్ చివరి నాటికి ఈ సంఖ్య 350 దాటింది. అంతకుముందు జింబాబ్వేలో, వేటగాళ్ళు జంతువులకు సైనైడ్ ఇచ్చినట్టు కేసు కూడా నమోదయింది. 2018 లో బోట్స్వానాలో 90 ఏనుగుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇందులో చాలా వరకు కళేబరాలు దంతాలు లేకుండా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే దంతాల కోసం స్మగ్లర్లు వీటిని చంపి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరోవైపు స్థానికులు చెబుతున్న దాని ప్రకారం, బ్రతికి ఉన్న ఏనుగులు కూడా నీరసంగా నడుస్తున్నాయని.. బ్యాక్టీరియా-వైరస్ కారణంగా, వాటి మానసిక స్థితి క్షీణించిందని కొందరు అంటుంటే. ఏనుగుల మీద పెద్దఎత్తున విషం ప్రయోగం జరిగినట్టు మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే వైద్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఏనుగులు కొన్ని ఒకేసారిగాను.. కొన్ని నెలల తరబడి గాను మరణించి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. వీటి మృతికి కారణాలు తెలియాలంటే కనీసం నెలరోజులైనా పట్టద్దని అంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories