Gaza -Israel: గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు..33 మంది దుర్మరణం

Gaza -Israel: గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు..33 మంది దుర్మరణం
x

Gaza -Israel: గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు..33 మంది దుర్మరణం

Highlights

Gaza -Israel : గాజాపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 33 మంది దుర్మరణం చెందారు. అందులో 21మంది మహిళలు ఉన్నారు. భవనాల శిథిలాల కింద చాలా మంది ఇరుక్కొని ఉంటారని భావిస్తున్నారు.

Gaza -Israel : గాజాపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులతో విరుచుపడుతోంది. ఉత్తర గాజా స్ట్రిప్ లోని జబాలియా శిబిరంపై ఇజ్రాయెల్ సైన్యం శుక్రవారం సాయంత్రం జరిపిన వైమానిక దాడిలో కనీసం 33 మంది పాలస్తీనియన్లు మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని గాజా ప్రభుత్వ మీడియా కార్యాలయం తెలిపింది. మరణించిన వారిలో 21 మంది మహిళలు ఉన్నారు.

శిథిలాలు.. భవనాల కింద అనేక మంది చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ బాంబు దాడిలో 85 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మీడియా కార్యాలయం విడుదల చేసిన ప్రకటనను ఉటంకిస్తూ జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.

అయితే ఇజ్రాయెల్ సైన్యం జబాలియా క్యాంప్‌లోని అనేక ఇళ్లపై బాంబు దాడి చేసింది. ఈ ఘటనపై ఇజ్రాయెల్ సైన్యం ఇంకా స్పందించలేదు. అక్టోబర్ 7, 2023న దక్షిణ ఇజ్రాయెల్ సరిహద్దు గుండా హమాస్ విధ్వంసానికి ప్రతీకారంగా గాజా స్ట్రిప్‌లో హమాస్‌పై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడి చేస్తోంది.

ఈ సమయంలో సుమారు 1,200 మంది మరణించారు. 250 మంది బందీలుగా ఉన్నారు. గాజా స్ట్రిప్‌లో కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడుల్లో పాలస్తీనియన్ల మరణాల సంఖ్య 42,500 కు పెరిగిందని గాజా ఆధారిత ఆరోగ్య అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

మరోవైపు ఇజ్రాయెల్ పై సిరియా వైమానిక దాడులు చేసేందుకు యత్నించింది. తమ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన వైమానిక దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. అది తమ భూభాగంలోకి ప్రవేశించకముందే కూల్చివేసినట్లు తెలిపింది. ఇరాన్ మద్దతుతోనే సిరియా ఈ డ్రోన్లను ప్రయోగించినట్లు తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories