గ్రహాంతరవాసులు భూమికి వ‌చ్చారా? అమెరికా యుద్ధనౌక వ‌ద్ద‌కు ఫ్లయింగ్‌ సాసర్లు ఎలా..

US intelligence report to address UFO
x

UFO(ఊహాచిత్రం)

Highlights

UFOs: ఈ విశ్వంలో ఒక భూమిపైనే కాకుండా ఇత‌ర గ్రహాల‌పై కూడా జీవి జాడ కోసం శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌లు చేస్తునే ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప‌రిశోథ‌న‌లు...

UFOs: ఈ విశ్వంలో ఒక భూమిపైనే కాకుండా ఇత‌ర గ్రహాల‌పై కూడా జీవి జాడ కోసం శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌లు చేస్తునే ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప‌రిశోథ‌న‌లు జ‌రుగుత‌న్నాయి. గ్ర‌హాంత‌ర వాసుల ఉనికి కోసం చేస్తున్న అన్వేష‌ణ కొన‌సాగుతూనే ఉన్నాయి. 'ఫ్లయింగ్‌ సాసర్లు' భూమిని వ‌స్తున్నాయని వాటిని చూశామ‌ని కొంద‌రూ చెబుతున్నారు. కొంత మంది అయితే గ్రహాంతరవాసుల త‌మ‌పై అత్యాచారయ‌త్నం చేశార‌ని మ‌రికొంద‌రూ చెబుతున్నారు. అయితే గ్రహాంతరవాసుల 'ఫ్లయింగ్‌ సాసర్లు' (యూఎఫ్‌వో)లు అప్పుడప్పుడూ భూమిని సందర్శించి వెళుతున్నాయా? అనాదిగా మనిషి బుర్రను తొలుస్తున్న ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా పరిశోధనాత్మక డాక్యూమెంటరీ ఫిలిం దర్శకుడు జెరీమీ కార్బెల్‌ దీనిపై సంచలన ప్రకటన చేశారు.

అమెరికాకు చెందిన ఒక యుద్ధనౌకను కొన్ని 'ఫ్లయింగ్‌ సాసర్లు' చుట్టుముట్టినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన రాడార్‌ తెర దృశ్యాలను ఆయన విడుదల చేశారు. ఇందులో 9 వస్తువులు నౌకకు దగ్గరగా రావడం కనిపించింది. యూఎస్‌ఎస్‌ ఒమాహా అనే యుద్ధనౌకను 9 యూఎఫ్‌వోలు చుట్టుముట్టాయని కార్బెల్‌ చెప్పారు. ఆయన విడుదల చేసిన రాడార్‌ చిత్రాల్లో అవి కనిపించాయి. అవి గంటకు 70 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు కార్బెల్‌ తెలిపారు. కాలిఫోర్నియాలోని శాన్‌ డియెగో తీరానికి చేరువలో 2019 జులైలో ఈ ఘటన జరిగిందని కార్బెల్‌ తెలిపారు. ఈ ఫుటేజీ వాస్తవమైనదేనని అమెరికా రక్షణ శాఖ కూడా ధ్రువీకరించింది.

ఈ నెల 15న కూడా యూఎఫ్‌వోలకు సంబంధించిన ఒక వీడియోను ఆయన విడుదల చేశారు. అందులో ఒక గోళాకార యూఎఫ్‌వో కనిపించింది. ఆ తర్వాత అది సముద్రంలో కలిసిపోయింది. ఈ వీడియో కూడా అధీకృతమైనదేనని రక్షణ శాఖ ధ్రువీకరించింది. ఒమాహా యుద్ధనౌక వేగంతో పోలిస్తే ఇది దాదాపు 3రెట్లు ఎక్కువ. ఆ తర్వాత రాడార్‌ తెరపై నుంచి అదృశ్యమైనట్లు వివరించారు. రాడార్‌ పరిధికి అందకుండా అవి వెళ్లిపోయి ఉంటాయని తెలిపారు. ''ఆకాశంలో చాలా ఎత్తుకు గానీ సముద్రంలోకి గానీ అవి చేరి ఉండొచ్చు'' అని పేర్కొన్నారు. నౌకలోని కమాండ్‌ కేంద్రంలో ఈ వీడియోను చిత్రీకరించారని, ఈ ఫుటేజీని 'రహస్యమైనది'గా రక్షణశాఖ వర్గీకరించలేదన్నారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూడా ఇటీవల యూఎఫ్‌వోల ప్రస్తావన చేశారు. తన హయాంలో వీటి గురించి ఆరా తీసినట్లు చెప్పారు. ''ఆకాశంలో కొన్ని గుర్తుతెలియని వస్తువులకు సంబంధించిన ఫుటేజీ, రికార్డులు ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి... ఎక్కడికి వెళ్లాయన్నది మనకు తెలియదు'' అని పేర్కొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories